IND Vs PAK : ఆసియా కప్ 2025 (Asia Cup) మ్యాచ్ ల ప్రారంభ సమయాన్ని ఐసీసీ మార్పు చేసినట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ కి కూడా సమయం మారినట్టు సమాచారం. పాకిస్తాన్ (Pakistan) తో జరిగిన తరువాత రోజు అనగా సెప్టెంబర్ 15న జరిగే యూఏఈ-ఒమన్ మ్యాచ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు జరిగింది. వాస్తవానికి సెప్టెంబర్ 14న రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. దుబాయ్ లో పగటి పూట ఎండలు కాస్త ఎక్కువగా ఉండటంతో మ్యాచ్ ను ఒక అరగంట ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. అంటే దుబాయ్ లో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం అయితే.. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుందని సమాచారం.
Also Read : Lalit Modi : శ్రీశాంత్ భార్యపై లలిత్ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు.. నీకేంటి నొప్పి అంటూ
పాక్ vs ఇండియా మ్యాచ్ లో మార్పు
మొత్తం 19 మ్యాచ్ లకు గాను 18 మ్యాచ్ లకు సమయం మార్చినట్టు తెలుస్తోంది. ఇందులో ఫైనల్ కూడా ఉన్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఇండియా ప్రతీ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కూడా అదే టైమ్ కి ప్రారంభం అవుతుంది. టైమింగ్స్ మార్పునకు తీవ్ర ఎండలే కారణం తెలుస్తోంది. దుబాయ్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న క్రమంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వాస్తవానికీ ఆసియా కప్ 2025 టీ-20 ఫార్మాట్ లో జరుగుతుంది. యూఏఈలో సెప్టెంబర్ నెలలో దాదాపు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ వేడి నుంచి ఆటగాళ్లకు కాస్త ఉపవమనం లభించడానికి మ్యాచ్ సమయాన్ని అరగంట కు పెంచారు.
ఆ మ్యాచ్ తప్ప..
క్రికెట్ బోర్డు ఈ సమయాన్ని మార్చాలని బ్రాడ్ కాస్టర్ (Broadcaster)ని కోరింది. దుబాయ్ లో భరించలేని వేడి ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా కప్ లో మొత్తం 19 మ్యాచ్ లు జరుగుతాయి. వీటిలో 18 మ్యాచ్ లకు సంబంధించి సమయాలను అరగంట ఆలస్యంగా జరిగేలా టైమింగ్స్ మార్పులు చేసారు. అయితే వీటిలో సెప్టెంబర్ 15 జరిగే ఒమన్-యూఏఈ మధ్య జరిగే మ్యాచ్ పగటి వేళలో జరుగుతుండటంతో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ మ్యాచ్ మాత్రం భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం అవుతుంది. మిగతా మ్యాచ్ లు అన్ని కూడా రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. ఆసియా కప్ లో టీమిండియా సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ లో తలపడనుంది. ఆ తరువాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో హోరా హోరీ పోరు జరుగనుంది. సెప్టెంబర్ 19న ఒమన్ తో ఆడనుంది భారత్. మొత్తం మూడు మ్యాచ్ లను లీగ్ దశలో ఆడనుంది. ఇక ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగనుంది.