shraddha das: సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి బయటకు రావాలి అంటే భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా అభిమానుల దాడికి, వారి ప్రేమాభిమానాలకు తట్టుకోలేక బాడీగార్డ్స్ ను కూడా నియమించుకుంటున్న విషయం తెలిసిందే. కానీ మరి కొంతమంది నటీనటులు మాత్రం పబ్లిక్ తో కలిసిపోయి తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ఏకంగా పబ్లిక్ లో తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టేసింది. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రెచ్చిపోయింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాదాస్ (Shraddha Das).
తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టేసిన శ్రద్ధాదాస్..
దేశవ్యాప్తంగా గణేశుడి చతుర్థి ఎంత వైభవంగా జరిగిందో.. గణేష్ నిమజ్జనం కూడా అంతే ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా గణేష్ నిమజ్జన వేడుకలో తన డాన్స్ తో ఆకట్టుకున్నారు. తన అపార్ట్మెంట్ గణేషుడి నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న ఈమె.. రోడ్డుపై స్నేహితులతో కలిసి తీన్మార్ స్టెప్పులు వేశారు. వర్షం పడుతున్నా.. పట్టించుకోకుండా ఉత్సాహంగా డాన్స్ చేస్తూ అందరిని అలరించారు శ్రద్ధాదాస్. అంతేకాదు స్వయంగా డ్రమ్స్ వాయించి తన ఉత్సాహాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియోని ఆమె స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అంతేకాదు నిమజ్జన ఉత్సవాలలో ఇదే బెస్ట్ అంటూ కూడా శ్రద్ధ పోస్ట్ చేసింది. మొత్తానికి అయితే శ్రద్ధాదాస్ షేర్ చేసిన ఈ పోస్ట్ చూసి.. సెలబ్రిటీలు అప్పుడప్పుడు కూడా ప్రజల్లోకి వస్తూ తమ ఆనందాన్ని పంచుకోవడం సంతోషంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే శ్రద్ధ దాస్ కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్రద్ధాదాస్ సినిమాలు..
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun), కాజల్ (Kajal ) హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘ఆర్య 2’ సినిమాలో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమె అందానికి, గ్లామర్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఏక్ మిని కథ, మరోచరిత్ర వంటి చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. తెలుగులో ఒకప్పుడు మంచి అవకాశాలు అందుకున్న ఈమె.. ఆ తర్వాత కాలంలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది. దాంతో అవకాశాలు తగ్గడంతో చిత్ర పరిశ్రమకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ.
అభిమానులను ఆకట్టుకోవడానికి..
ఇకపోతే సినీ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ అభిమానులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోలు షేర్ చేయడమే కాకుండా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు గణేష్ నిమజ్జనంలో పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచింది శ్రద్ధాదాస్.
also read:Nandamuri Family: మళ్లీ మొదలైన వార్.. హరికృష్ణ జయంతితో బయటపడ్డ గొడవలు!
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
వినాయక నిమజ్జనంలో డోలు వాయిస్తూ.. డ్యాన్స్ చేసిన హీరోయిన్ శ్రద్ధా దాస్..#ShraddhaDas #ganeshutsav #ganeshnimmarjan #dance #heroin @shraddhadas43 pic.twitter.com/ATFTx5hQ7I
— BIG TV Cinema (@BigtvCinema) September 2, 2025