E-Paper
Advertisement

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు కివీస్?.. గ్రూప్ -1 లో రెండో బెర్త్ ఎవరికి ?

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు కివీస్?.. గ్రూప్ -1 లో రెండో బెర్త్ ఎవరికి ?
Advertisement

20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకుంది. చివరి మ్యాచ్ లో ఐర్లాండ్ పై 35 పరుగుల తేడాతో కివీస్ గెలిచింది. లీగ్ దశలో 5 మ్యాచ్ ల్లో 3 విజయాలు నమోదు చేసింది కివీస్ జట్టు.. మరో మ్యాచ్ లో పరాజయం పొందింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టు సెమీస్ చేరడం దాదాపు ఖాయమైంది.

ఆడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 185 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెలరేగి ఆడాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 32 పరుగులు, మిచెల్ 31 పరుగులు, కాన్వే 28 పరుగులు చేసి జట్టు భారీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ బౌలర్ లిటిల్ సంచలన ప్రదర్శన చేశాడు. 19వ ఓవర్ లో హ్యాట్రిక్ సాధించాడు. వరుస బంతుల్లో విలియమ్సన్ , నీషమ్ , సాంట్నర్ ను అవుట్ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 185 పరుగులు స్కోర్ సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దీంతో ఆ జట్టు 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 68 పరుగులు సాధించింది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ 37 పరుగులు, బాల్ బైర్న్ 30 పరుగులు చేసి వెంటవెంటనే అవుటయ్యారు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్ద స్కోర్లు సాధించలేదు. దీంతో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో పెర్గూసన్ 3 వికెట్లు తీయగా సాంట్నర్, సోధి, సౌతీ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు.

Advertisement

సెమీస్ కు చేరే జట్లేవి?
లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు ఆడిన కివీస్ ఖాతాలో 7 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు రన్ రేట్ 2.113 ఉంది. సెమీస్ రేసులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక పోటీలో ఉన్నాయి. ఆస్ట్రేలియా ..ఆఫ్గానిస్థాన్ పై విజయం సాధిస్తే అప్పుడు ఆసీస్ ఖాతాలోకి 7 పాయింట్లు వస్తాయి. అయితే ఆ జట్టు రన్ రేట్ మైనస్ లో ఉంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ భారీతో తేడాతో గెలవాలి. ఇక ఈ గ్రూపులో చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్-శ్రీలంక తలపడతాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే ..కివీస్ తో సమానంగా 7 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్ చేరతాయి. ఈ లెక్కల ప్రకారం కివీస్ ముందంజలో ఉంది. చివరి మ్యాచ్ లో నెగ్గితే ఇంగ్లండ్ కు మెరుగైన అవకాశాలుంటాయి. ఇంగ్లండ్- శ్రీలంక మ్యాచ్ ఫలితంపైనే ఆసీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అంటే రెండో సెమీస్ బెర్త్ ఖరారు కావాలంటే చివరి లీగ్ మ్యాచ్ వరకు ఆగాల్సిందే.

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

Big Stories

Advertisement
×