BigTV English

KKR Vs CSK : చెపాక్ లో చెన్నైకి షాక్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..?

KKR Vs CSK : చెపాక్ లో చెన్నైకి షాక్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..?

KKR Vs CSK : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేసింది. చెన్నై ప్రారంభం నుంచే షాక్ కి గురైంది. ఓపెనర్లు ఎప్పుడైతే విఫలం చెందారో వరుసగా చెన్నై బ్యాటర్లు లైన్ కట్టారు. రచిన్ రవీంద్ర 04, కాన్వె 12, రాహుల్ త్రిపాఠి 16, విజయ్ శంకర్ 29 టాప్ స్కోరర్ గా నిలిచాడు. అశ్విన్ 1, జడేజా 0, దీపక్ హుడా 0, ధోని 1 పరుగులు చేసి చకా చకా ఔట్ అయ్యారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 100 పరుగులు కూడా చేయలేకపోయింది.


ముఖ్యంగా కోల్ కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.  కేకేఆర్ తరపున బౌలింగ్ వేసిన ప్రతీ ఒక్కరూ వికెట్ తీయడం విశేషం. సునీల్ నరైన్ 3, వరున్ చక్రవర్తి 2, హర్షిత్ రాణా 2, మొయిన్ అలీ 1,  వైభవ్ అరోరా 1  వికెట్లు తీశారు. దీంతో చెన్నై కి ఊహించని షాక్ తగిలింది. చెన్నై జట్టు కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది.  ఈ లెక్కన చూస్తే.. కేకేఆర్ చాలా సునాయసంగా విజయం సాధించేలా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్లు కేకేఆర్ మాదిరిగా బౌలింగ్ చేస్తారా..? లేదా వీళ్ల జట్టులో నూర్, అశ్విన్, జడేజా స్పిన్నర్స్ ఉండటంతో వికెట్లు తీస్తే కొంచెం ఆశలు ఉంటాయి.

కెప్టెన్ కూల్ ఎం.ఎస్ ధోనిని ఉద్దేశించి మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ధోనీకి కొత్తగా కెప్టెన్సీ ఇచ్చినంత మాత్రానా.. సీఎస్కే గెలుస్తుందనడం న్యాయం కాదన్నారు. చెన్నై జట్టులో చాలా లోపాలు ఉన్నాయని.. వాటిని అధిగమిస్తేనే విజయాలు తప్ప.. ధోనీకి కెప్టెన్సీ ఇస్తే గెలుస్తుందనడం కరెక్ట్ కాదన్నారు. ఊతప్ప చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వాస్తవం అయ్యాయి.  ప్రస్తుతం జరిగిన తొలి ఇన్నింగ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈ సీజన్ లో ఇంత దారుణంగా ఏ జట్టు కూడా విఫలం చెందలేదు. తొలి సారిగా తక్కువ స్కోర్ 2025 ఐపీఎల్ లో సీఎస్కే చేయడం విశేషం.


చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ భారీ స్కోర్ ను నమోదు చేసి రికార్డులు సృష్టించింది. కానీ ఇవాళ ఈ సీజన్ లో తక్కువ స్కోర్ నమోదు చేసి రికార్డు నమోదు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. 43 ఏళ్ల ధోనీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి అన్ క్యాప్డ్ కెప్టెన్ గా ధోనీ రికార్డులకెక్కాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడినైనా అన్ క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణించవచ్చు. ధోనీ 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ పై చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ధోనిని అన్ క్యాప్డ్ కోటాలో రూ.4కోట్లు వెచ్చించి చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. ధోనీ కెప్టెన్ ఉన్న సమయంలో 2010, 2011, 2018, 2021, 2023లో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలను అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్.

 

Related News

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×