హిందువులు చేసే మరొక పండుగ హనుమాన్ జయంతి. ఆరోజు వీధుల్లో హనుమాన్ ర్యాలీలు సాగుతూ ఉంటాయి. చైత్రమాసంలోని పౌర్ణమి రోజున హనుమాన్ జన్మించారని చెబుతారు. హనుమాన్ తల్లి అంజని ఆ రోజే ప్రసవించిందని పురాణాలు చెబుతూ ఉంటాయి. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 12న వచ్చింది. ఆ రోజు శనివారం. అప్పుల బారి నుండి తప్పించుకోవాలనుకునేవారు… ఆ రోజు కొన్ని పూజలు పరిహారాలు చేస్తే ఫలితం ఉంటుంది.
హనుమాన్ జయంతి రోజు దేశవ్యాప్తంగా ఉన్న హనుమ దేవాలయాలు కిటకిటలాడిపోతాయి. అక్కడ భజనలు, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఈ పవిత్రమైన దినోత్సవాన పరిహారాలు చేయడం ద్వారా మీ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.
అప్పులు బాధ తీర్చుకోండిలా
హనుమాన్ జయంతి రోజు రాత్రి స్నానం చేసిన నీటిలో గంగాజలాన్ని కొంచెం చేసి కలుపుకోండి. ఆ నీటితో స్నానం చేయండి. తర్వాత చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఆ తరువాత గ్రహాల శాంతి కోసం మీ మనస్సులో ఓం శనైశ్చరాయ నమః, ఓం అంగారకాయ నమః అనే మంత్రాలను జపించండి. మీ జాతకంలో అంగారకుడు, శని బలహీనంగా ఉంటే ఈ మంత్రాలని జపించడం ద్వారా బలంగా మారుతాయి. అప్పులు పాలు అవ్వడానికి ఈ రెండు గ్రహాలే కారణమని చెప్పుకుంటారు.
హనుమాన్ జయంతి రాత్రి మీ ఇంటి దక్షిణం వైపు దీపం వెలిగించండి. ఆ తర్వాత లక్ష్మీదేవి విగ్రహం ముందు కూర్చొని శ్రీ లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు. అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. హనుమాన్ జయంతి రాత్రి హనుమంతునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఆ రోజు హనుమాన్ ముందు నెయ్యి దీపం వెలిగించి ఎర్రటి పువ్వులు సమర్పించి హనుమాన్ చాలీసా చదవండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే హనుమాన్ కు బెల్లం పప్పు నైవేద్యంగా సమర్పించండి.
మీ జాతకంలో శనిదోషం ఉన్నా కూడా అప్పుల బారిన ఎక్కువగా పడతారు. శని దోషాన్ని శాంతింప చేయడానికి హనుమాన్ జయంతి రోజు రాత్రి రావి చెట్టు కింద దీపం పెట్టండి. ఆవనూనెతో ఆ దీపాన్ని వెలిగించాలి. స్వచ్ఛమైన హృదయంతో శని స్తోత్రాన్ని పఠించడం వల్ల శని చెడు ప్రభావాలు చాలా వరకు తొలగిపోతాయి.
Also Read: హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి ? ఏం చేయకూడదు?
అప్పుల బాధలతో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు హనుమను నమ్ముకొని పైన చెప్పిన పరిహారాలను హనుమాన్ జయంతి రోజు రాత్రి చేయడం వల్ల మీకు ఎంతో ఫలితం కనిపిస్తుంది. ఏ పని చేసినా కూడా పూర్తి స్వచ్ఛమైన హృదయంతో చేయాలి. హనుమాన్ జయంతి రోజు రాత్రి కూడా మీరు స్వచ్ఛమైన మనసుతో, పరిశుభ్రమైన శరీరంతో ఈ పండుగను నిర్వహించుకోవడం చాలా ముఖ్యం.