Big Stories

KKR vs RR IPL 2024 Highlights: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు.. చివరి వరకు పోరాడి ఓడిన కోల్ కతా

KKR vs RR match highlights 2024(Today’s sports news): ఐపీఎల్ మ్యాచ్ లో నిజమైన మజాను మరోసారి అభిమానులు అనుభవించారు. కోల్ కతా వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ హై డ్రామా నడిచింది. ఎట్టకేలకు రాజస్థాన్ ని జాస్ బట్లర్ ఒంటిచేత్తో గెలిపించాడు.

రాజస్థాన్ మొదట టాస్ గెలిచి బౌలింగు తీసుకుంది. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో సునీల్ నరైన్ సెంచరీ చేయడంతో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో తడబడిన రాజస్థాన్ ని జాస్ బట్లర్ ఒక్కడూ ఒంటరిగా పోరాడి విజయ తీరాలకు చేర్చాడు.

- Advertisement -

నిజానికి కోల్ కతా నిర్దేశించిన 223 పరుగుల టఫ్ టార్గెట్ ని రాజస్థాన్ తడబడుతూనే ప్రారంభించింది. మొదట్లోనే ఓపెనర్ యశస్వి (19) అవుట్ అయ్యాడు. జాస్ బట్లర్ జాగ్రత్తగా ఆడుతూ అడపాదడా ఫోర్లు, సిక్సులు కొడుతూ స్కోరుబోర్డుని నడిపించాడు. కానీ మరోవైపు తనకి సపోర్ట్ ఇచ్చేవారే కరవయ్యారు.

- Advertisement -
KKR vs RR IPL 2024
KKR vs RR IPL 2024

కెప్టెన్ సంజూ శాంసన్ (12) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. తర్వాత రియాన్ పరాగ్ 14 బంతుల్లో ధనాధన్ 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 2 సిక్స్ లు, 4 ఫోర్లు ఉన్నాయి. తర్వాత ధ్రువ్ (2), అశ్విన్ (8), హెట్ మెయిర్ (0) ఒకవైపు నుంచి క్యూ కడుతుంటే, జాస్ బట్లర్ తన ఆట తను ఆడుతూ ముందుకి వెళ్లాడు.

Also Read: టీ 20 ప్రపంచకప్ లో.. దినేశ్ ఆడుతున్నట్టేనా?

ఒకదశలో 12.1 ఓవర్ కి 6 వికెట్ల నష్టానికి 121 పరుగులతో రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. వరుణ్ చక్రవర్తి వరుస బంతుల్లో అశ్విన్, హిట్ మెయిర్ లను అవుట్ చేశాడు. దీంతో రాజస్థాన్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ జాస్ బట్లర్ అలా అనుకోలేదు. మొత్తం భారమంతా తనపై వేసుకున్నాడు.

మరోవైపు టెయిల్ ఎండర్లను అలాగే ఉంచుతూ, తనింక దంచికొట్టడం మొదలెట్టాడు.ఈ క్రమంలో  పావెల్ (26) తనకి కొద్దిగా సపోర్ట్ చేశాడు. తర్వాత ట్రెంట్ బౌల్ట్ డక్ అవుట్ అయ్యాడు. ఈ సమయంలో లాస్ట్ ఓవర్ హై డ్రామా నడిచింది.

ఆఖరి ఓవర్ కి 9 పరుగులు చేయాల్సి వచ్చింది. తను ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టాడు. అప్పటికి 5 బంతులు 3 పరుగులు చేయాలి. రెండో బాల్ కొట్టాడు కానీ సింగిల్ వచ్చేది తీయలేదు. మూడో బాల్ అలాగే చేశాడు. సింగిల్ తీయలేదు. ఎందుకంటే అటువైపు ఆవేశ్ ఖాన్ ఉన్నాడు. అందుకే బట్లర్ రిస్క్ తీసుకోలేదు.

ఇలా చూస్తే 3 బాల్స్ 3 రన్స్ కి పరిస్థితి వచ్చింది. అందరిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఈసారి మరో బాల్ కనెక్ట్ అవలేదు. దాంతో బట్లర్ లో కూడా టెన్షన్  మొదలైంది. అప్పుడు  2 బాల్స్ 3 పరుగులు గా మారింది. దాంతో బట్లర్ 5వ బాల్ కి రెండు పరుగులు తీశాడు. చివరికి 1 బాల్ 1 రన్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఆఖరి బాల్ రన్ చేసి విజయం ముంగిట రాజస్థాన్ ని నిలిపాడు. మొత్తానికి 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.జట్టుని గెలిపించాడు.

కోల్ కతా బౌలింగులో వైభవ్ ఆరోరా 1, హర్షిత్ రాణా 2, సునీల్ నరైన్ 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టాడు.

ఇకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఓపెనర్ సునీల్ నరైన్ సెంచరీ చేశాడు. 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. మరో  ఓపెనర్ ఫిల్ సాల్ట్ (10), కెప్టెన్ శ్రేయాస్ (11), ఆండ్రీ రస్సెల్ (13),  ఇలా చేసి అవుట్ అయ్యారు. అయితే అంగ్ క్రిష్ రఘువంశీ (30), రింకూ సింగ్ (20 నాటౌట్) చేయడంతో కోల్ కతా 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.

బౌలింగులో కూడా బాగానే వికెట్లు తీశారు. కాకపోతే జాస్ బట్లర్ ని ఆపలేకపోయారు. దాంతో మ్యాచ్ చేజారిపోయింది. ట్రెంట్ బౌల్ట్ 1, ఆవేశ్ ఖాన్ 2, కుల్దీప్ సేన్ 2, చాహల్ 1 వికెట్ పడగొట్టారు.

ఈ గెలుపుతో రాజస్థాన్ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది. కోల్ కతా రన్ రేట్ ప్రకారం 2వ స్థానంలోనే ఉండటం విశేషం. అయితే తనలాగే 8 పాయింట్లతో చెన్నయ్, హైదరాబాద్ కూడా తన వెనుకే ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News