BigTV English

T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో.. దినేశ్ ఆడుతున్నట్టేనా?

T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో.. దినేశ్ ఆడుతున్నట్టేనా?

Dinesh karthik t20 world cup news(Cricket news today telugu): ఐపీఎల్ మ్యాచ్ లు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. అందులో కొందరి ఆటను చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాంటి వారిలో  ఒకరు ఆర్సీబీ జట్టులో ఉన్న వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన దినేశ్ కార్తీక్. నిజానికి తను టీమ్ ఇండియాలోకి వస్తుంటాడు. వెళుతుంటాడు. జట్టులోకి రావడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తాడో, తీరా వెళ్లిన తర్వాత అంతే తీరులో నిరాశపరుస్తుంటాడని అంటుంటారు.


ఎప్పుడో ధోనీ కాలం నాటి మనిషిగా చెప్పాలి. ఎందుకంటే ధోనీ టెస్టుల్లోకి 2005లో వచ్చాడు. దినేష్ తనకన్నా ముందే 2004లో ఫస్ట్ టెస్ట్ ఆడాడు. ఇద్దరూ దాదాపు ఒకేసారి వచ్చారు. కానీ ధోనీ ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయాడు. దినేశ్ కార్తీక్ మాత్రం ఇంకా పడుతూ లేస్తూనే ఉన్నాడు. నిజానికి ధోనీ లాగే తను కూడా కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో అవకాశాలు దక్కలేదని అంటారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ ఐపీఎల్ సీజన్ తనకి ఆఖరిదని కార్తీక్ ప్రకటించాడు. కాకపోతే 2024లో జరగననున్న ఐసీసీ టీ 20 ప్రపంచకప్ లో స్థానం కోసం మాత్రం ఎదురుచూస్తున్నాడు. ఒకవేళ దొరికితే మాత్రం అక్కడ కూడా ఆడి మొత్తానికి క్రికెట్ కి గుడ్ బై చెప్పేలా ఉన్నాడని అంటున్నారు.


Also Read: పాండ్యా బౌలింగ్‌పై సందేహాలు, ఇలాగైతే కష్టమే?

2024 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరఫున దినేశ్ కార్తీక్ అద్భుతమైన ప్రతిభ చూపుతున్నాడు. తాజాగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నిజానికి తనకి ఎవరో ఒకరు సపోర్టుగా నిలిస్తే మాత్రం, మ్యాచ్ ని తప్పకుండా గెలిపించేవాడని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడి 226 పరుగులు చేశాడు. 204.5 స్ట్రయిక్ రేట్ గా ఉంది.

Dinesh Karthik Will Play World Cup..
Dinesh Karthik Will Play World Cup..

హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే, 288 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ బ్యాటింగ్ కి దిగింది. అప్పటికి కెప్టెన్ డుప్లెసిస్ 62 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అప్పటికి స్కోరు 121 మాత్రమే. 9.3 ఓవర్లు అయిపోయాయి. ఇంక 63 బంతుల్లో 167 పరుగులు చేయాలి. ఈ దశలో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ కి వచ్చాడు.

తను మొదటి బౌండరీ చేయడానికి 9 బంతులు ఎదుర్కొన్నాడు. ఇంక అక్కడి నుంచి ఆగలేదు. విధ్వంసం జరిగిపోయింది. కెప్టెన్ కమిన్స్ ని కూడా వదల్లేదు. తనకి రెండు సిక్సర్లను తగిలించాడు. బాబోయ్.. నేను కార్తీక్ కి బౌలింగ్ వేయనని కమిన్స్ సరదాగా అనడం హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 సీజన్ లో హయ్యస్టు సిక్సర్ కొట్టాడు. అది 108 మీటర్ల ఎత్తు ఎగిరింది. కొంచెం ఉంటే స్టేడియం అవతల పడేదే. ఈ క్రమంలో అందరూ టీ 20 ప్రపంచ కప్ కోసం కార్తీక్ ఇలా ఆడుతున్నాడని చెబుతున్నారు. మరోవైపు ముంబయితో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ అన్నమాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

శభాష్ డీకే.. నా మదిలో ఏం ఉందంటే, రేపు ప్రపంచకప్ లో ప్లేస్ కోసం ఆడుతున్నట్టుగా ఉంది. అని సరదాగా ఆటపట్టించిన మాటల్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.

మొత్తానికి దినేష్ కార్తీక్ మాత్రం ఐపీఎల్ చరిత్రలో గుర్తుండిపోయే ఆట ఆడాడని అంతా అంటున్నారు. మ్యాచ్ ఓడిపోయినా సరే, తన ఆటని అంతా గుర్తు చేసుకుంటారని అంటున్నారు. అందరిలాగే మనం కూడా టీ20 ప్రపంచకప్ లో తను ఆడాలని కోరుకుందాం.

Related News

IND Vs PAK : ఆసియా కప్ ఫైనల్ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. హరీస్ రవుఫ్ పై బ్యాన్..!

India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మ‌రోసారి రుజువైంది..చేతులారా వ‌చ్చిన రనౌట్ వ‌దిలేశారుగా

India vs Pakistan final: టీమిండియా, పాక్ మ‌ధ్య ఫైన‌ల్స్‌… 41 ఏళ్లలో తొలిసారి…రికార్డులు ఇవే..ఫ్రీగా చూడాలంటే?

IND vs SL: నేడు శ్రీలంక‌తో మ్యాచ్‌…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బ‌లాబ‌లాలు ఇవే

Rohith Sharma : మ‌రోసారి 10 కిలోలు తగ్గిన రోహిత్ శ‌ర్మ‌…ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

Big Stories

×