Big Stories

Sunil Narine IPL History: అబ్బో.. సునీల్ నరైన్ వెంట ఎన్ని రికార్డులో..

Sunil narine record in IPL(Sports news headlines): కోల్ కతా ఓపెనర్ సునీల్ నరైన్ ఐపీఎల్ కెరీర్ లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అయితే తను చేసింది ఒక్క సెంచరీయే గానీ ఎన్నో రికార్డులు ఆయన వెంట పరిగెత్తుకు వచ్చాయి. అంతేకాదు ఎవరికీ సాధ్యం కాని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వీటితో పాటు తన పేరు మీద ఒక కొత్త రికార్డ్ ను నమోదు చేశాడు.

- Advertisement -

వెస్టిండీస్ మాజీ  ఆటగాడైన సునీల్ నరైన్ విధ్వంసం చేశాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి 49 బంతుల్లో సెంచరీ చేశాడు. ఓవరాల్ గా 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. అంతేకాదు ఇదే మ్యాచ్ లో ఒక క్యాచ్ అందుకున్నాడు. అలాగే ఒక వికెట్ కూడా పడగొట్టాడు. ఇలా ఐపీఎల్ మొత్తమ్మీద 17 ఏళ్లలో ఈ మూడు ఫీట్లను సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.

- Advertisement -
Sunil narine record in IPL
Sunil narine record in IPL

ఇక ఐదు వికెట్ల హాల్ తో పాటు సెంచరీ చేసిన తొలి  ఆటగాడిగా నిలిచాడు. 2012 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ పై 5 వికెట్లు తీశాడు.

Also Read: ఛేజింగ్ లో సెంచరీల వీరుడు.. జోస్ బట్లర్

ఇంతేకాదండోయ్ ఐపీఎల్ లో హ్యాట్రిక్ వికెట్లు కూడా తీశాడు. ఇలా హ్యాట్రిక్ కమ్ సెంచరీ చేసిన మూడో ప్లేయర్ గా నిలిచాడు. 2013లో పంజాబ్ పై హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఘనత సాధించాడు.

ఐపీఎల్ లో 100 వికెట్లతో పాటు సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కూడా నరైన్ రికార్డ్ సృష్టించాడు. నరైన్ ఇప్పటివరకు ఐపీఎల్ లో 170 వికెట్లు పడగొట్టాడు.

ఇలా సెంచరీతో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న నరైన్ కి ఇవేవీ ఆనందాన్ని ఇవ్వడం లేదని తెలిపాడు. మ్యాచ్ గెలిచి ఉంటే, అప్పుడు ఇవి బోనస్ గా ఉండేవని అంటున్నాడు. ఒక  స్ఫూర్తిదాయక క్రీడాకారుడిగా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News