BigTV English
Advertisement

Jos Buttler: ఛేజింగ్ లో సెంచరీల వీరుడు.. జోస్ బట్లర్

Jos Buttler: ఛేజింగ్ లో సెంచరీల వీరుడు.. జోస్ బట్లర్

KKR vs RR IPL 2024 Jos Buttler Century Powers Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ ఊహించని విజయం సాధించింది. అందరూ జోస్ బట్లర్ ఆడిన ఆట తీరుని మరిచిపోలేకపోతున్నారు. ఓడిపోయే మ్యాచ్ ని ఎంత గొప్పగా నిలబెట్టాడ్రా.. నెట్టింట హోరెత్తిపోతోంది. మొత్తానికి ఐపీఎల్ 2024 సీజన్ లో ప్రస్తుతం తనే నెంబర్ వన్ క్రికెటర్ గా మారిపోయాడు.


రాజస్థాన్ రాయల్స్ జట్టులో  జోస్ బట్లర్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (2), ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ (2)లను జోస్ బట్లర్ అధిగమించాడు.

Jos Buttler Century Powers Rajasthan Royals
Jos Buttler Century Powers Rajasthan Royals

ఇప్పటివరకు ఐపీఎల్ లో సగం మ్యాచ్ ల వరకు జరిగాయి. ఈ క్రమంలో టేబుల్ టాప్ లో రాజస్థాన్, దాని తర్వాత రెండో స్థానంలో కోల్ కతా నిలిచాయి. ఇప్పుడీ రెండు జట్ల మధ్య పోరు అనేసరికి అందరూ హోరాహోరీగా ఉంటుందనే అనుకున్నారు. అన్నట్టుగానే మ్యాచ్ అలాగే సాగింది.


Also Read: ఇద్దరికి గెలుపు ముఖ్యమే.. నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్

అయితే జోస్ బట్లర్ చేసిన ఒంటరి పోరాటం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా చేసింది.  ఛేజింగ్ లో మూడు సెంచరీలు చేసిన తనకి ఓవరాల్ గా చూస్తే 7వ సెంచరీ కావడం విశేషం. తనకన్నా ముందు విరాట్ కొహ్లీ 8 సెంచరీలతో ముందున్నాడు. వీరి తర్వాత క్రిస్ గేల్ (6)ను జోస్ అధిగమించాడు. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ నాలుగేసి శతకాలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

ఇకపోతే జోస్ బట్లర్ చేసిన సెంచరీ పై పలు విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యంగా  పవర్ ప్లేలో 12 బంతుల్లో 20 పరుగులు చేశాడు. తర్వాత మిడిల్ ఓవర్లలో 21 బంతుల్లో 22 పరుగులు చేశాడు. చివరికి డెత్ ఓవర్లలో 27 బంతుల్లో 65 పరుగులు చేసి శతకం చేయడంతో పాటు రాజస్థాన్ రాయల్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఇక కేకేఆర్‌పై జోస్ బట్లర్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఒకే జట్టుపై ఎక్కువ సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ రెండో స్థానంలో నిలిచాడు. కేకేఆర్, ఆర్‌సీబీలపై బట్లర్ రెండేసి శతకాలు నమోదు చేశాడు.

Related News

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

IPL 2026: సంజు ఎఫెక్ట్‌..జ‌డేజా అకౌంట్ పై బ్యాక్‌, ఐపీఎల్ 2026కు ముందే సంచ‌ల‌నం !

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్ ?

Jemimah Rodrigues: టార్చ‌ర్ భ‌రించ‌లేక‌ మ‌రోసారి మ‌తం మార్చేసిన జెమిమా ?

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Big Stories

×