BigTV English

IND vs ENG Second Test : రెండో టెస్టుకు జడేజా, రాహుల్ దూరం.. జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్..

IND vs ENG Second Test : రెండో టెస్టుకు జడేజా, రాహుల్ దూరం.. జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్..
IND vs ENG Second Test

IND vs ENG Second Test : మొదటి టెస్ట్ లో ఓటిమి పాలై, రెండో టెస్ట్ లో ఎలా బతికి బట్ట కట్టాలి రా, దేవుడా ! అని ఎదురుచూస్తున్న టీమ్ ఇండియాకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే విరాట్ లేక విలవిల్లాడుతున్న టీమ్ ఇండియాకు మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు.


అందరూ అనుకున్నట్టుగానే విశాఖలో జరగనున్న రెండో టెస్ట్ లో రవీంద్ర జడేజా ఆడటం లేదు. ఇప్పుడు మరో షాక్ ఏమిటంటే తనకి తోడు కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యాడు. ఇద్దరూ తొలిటెస్ట్ లో రాణించారు. కాకపోతే ప్రస్తుతం ఫామ్ లో లేని వాళ్లంతా జట్టులో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదంతా చూస్తుంటే.. ఇంగ్లాండ్ కి అదృష్టం కలిసొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ జట్టులో ఒకొక్కరు ఫామ్ లోకి వస్తుంటే, మనవాళ్లు ఒకొక్కరూ దూరం అవుతున్నారు. ఇదంతా  చూస్తుంటే నెమ్మదిగా సిరీస్ ను ఇంగ్లాండ్ చేతిలో పెట్టేసేలాగే ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


కాకపోతే వీరిప్లేస్ లో ఇండియా ఏ జట్టులో సెంచరీలు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ని పిలిచారు. తనతో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ రానున్నారు. మరి చివరికి ఎవరుంటారు? ఎవరు బెంచ్ మీదకు వెళతారనేది ప్రశ్నార్థకంగా ఉంది.

విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ముగ్గురూ బాగా ఆడుతున్నవాళ్లే కావడం పెద్ద సమస్యగా మారింది. శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్ ఫామ్ లో లేని వీళ్లందరూ ప్రస్తుతం జట్టులో ఉన్నారు. అక్కడ ఇంగ్లాండ్ లో చూస్తే పోప్ ఫామ్ లోకి వచ్చాడు. అలాగే టామ్ హార్ట్ లీకి మనవాళ్లు దొరికేస్తున్నారు. ఇతని బౌలింగ్ ని ఎలా ఎదుర్కోవాలో టీమ్ ఇండియా బ్యాటర్లు ట్రైనింగ్ తీసుకునేసరికి ఐదు టెస్ట్ మ్యాచ్ లు అయిపోయేలాగే ఉన్నాయి.

రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ఇద్దరూ కూడా తొడ కండరాల గాయాలతోనే బాధపడుతున్నారు. వీరిద్దరూ తమ పర్యవేక్షణలో ఉన్నట్టు, ఎన్‌సీఏలో చికిత్స తీసుకుంటున్నట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా.. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఇకపోతే హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

రెండో టెస్టుకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైశ్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆవేశ్‌ ఖాన్‌, రజత్‌ పటీదార్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహమ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సౌరభ్‌ కుమార్‌.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×