Big Stories

KL Rahul in Ind Vs Eng 4th Test 2024: టీమిండియాకు షాక్.. నాలుగో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం!

KL Rahul ruled out of Ranchi Test

KL Rahul Ruled out of Ranchi Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్‌కు గాయాల బెడద తప్పేలా లేదు. టీమిండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. విశాఖపట్నం, రాజ్‌కోట్‌ టెస్టులకు క్వాడ్రిసెప్స్ గాయంతో దూరమైన కేఎల్ రాహుల్ రాంచీలో జరిగే నాలుగో టెస్టుకూ దూరమయ్యాడు.

- Advertisement -

హైదరాబాద్‌లో జరిగిన సిరీస్ ఓపెనర్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ 86, 22 స్కోర్‌లను నమోదు చేసాడు. అయితే గాయం కారణంగా అతను వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఫిబ్రవరి 12న రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టుకు ముందు BCCI విడుదల చేసిన ప్రకటనలో రాహుల్ 90% మ్యాచ్ ఫిట్‌నెస్‌కు చేరుకున్నాడని.. అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడని పేర్కొంది.

- Advertisement -

అయితే, బోర్డు తాజా అప్‌డేట్ ప్రకారం, ధర్మశాలలో జరిగే చివరి టెస్టుకు కూడా రాహుల్ ఫిట్‌నెస్‌కు లోబడి ఉంటాడు. ఆకట్టుకునే ఫస్ట్‌క్లాస్ ఫామ్‌తో టెస్ట్ జట్టులో చోటు సంపాదించిన తోటి కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.

Read More: ధోనీ వల్లే, నా కెరీర్ నాశనమైంది: మనోజ్ తివారీ

31 ఏళ్ల రాహుల్ గత 10 నెలలుగా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. అతను IPL 2023 సమయంలో గాయం కారణంగా తొడ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కాగా ఆ తర్వాత పెద్ద మొత్తంలో ఆటలను కోల్పోయాడు. ఆసియా కప్‌లో తిరిగి వచ్చినప్పటి నుంచి రాహుల్ టెస్ట్, ODI ఫార్మాట్‌లలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

పేస్ ఏస్ జస్ప్రీత్ బుమ్రాకు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతి మంజూరు చేసింది. దీంతో బుమ్రా రాంచీ టెస్ట్‌కు దూరమయ్యాడు. వెస్టిండీస్ & USAలో జరిగే T20 ప్రపంచ కప్‌తో పాటు IPL షెడ్యూల్‌తో అతని పనిభార నిర్వహణను దృష్టిలో ఉంచుకుని బుమ్రాకు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ సిరీస్‌లో 13.64 సగటుతో 17 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచిన బుమ్రా, మొదటి మూడు టెస్టుల వ్యవధిలో ఇప్పటికే 80.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు.

రంజీ ట్రోఫీలో బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ తరఫున 50 పరుగులకు 10 వికెట్లు తీసి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తర్వాత ముఖేష్ కుమార్ తిరిగి జట్టుతో చేరాడు. అతని అన్‌క్యాప్డ్ స్టేట్‌మేట్ ఆకాష్ దీప్ జట్టులో మూడవ సీమర్‌గా వ్వవహరించనున్నారు.

4వ టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కె), యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వి.కీ), భరత్ (wk), మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News