KL Rahul : టీమిండియా క్రికెటర్ కే.ఎల్. రాహుల్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అతను అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా క్రికెట్ ఆడుతాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత ఓపెనర్ గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగాడు. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. రెండో ఇన్నింగ్స్ ఒక పక్క వికెట్లు కోల్పోతున్నప్పటికీ.. తాను ముందుండి సెంచరీ సాధించాడు. కేఎల్ రాహుల్ తో పాటు రిషబ్ పంత్ కూడా సెంచరీ చేయడం విశేషం. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేసే సమయంలో క్రికెటర్ సాయి సుదర్శన్ తో తమిళంలో మాట్లాడాడు. అలాగే కరుణ్ నాయర్ తో కన్నడంలో మాట్లాడాడు. ఇక వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తో కలిసి బ్యాటింగ్ చేసే సమయంలో హిందీ మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.
Also Read : Rj Mahvash : పరువు తీసుకున్న చాహల్ ప్రియురాలు…డ్రెస్ విప్పి చూపించక పోయావ్ అంటూ ట్రోలింగ్
ఆ భాషాలతో అభిమానులకు షాక్..
కేఎల్ రాహుల్ కి ఇన్ని భాషలు వచ్చా.. తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు ఇన్ని భాషలు ఎప్పుడు..? ఎలా నేర్చుకున్నాడు అని అంతా ఆశ్చర్యపోవడం విశేషం. వాస్తవానికి రాహుల్ కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో చదువుకున్నాడు. మంగలూరు కర్ణాటక, తమిళనాడు బోర్డర్ లో ఉండటంతో అక్కడ తమిళం, కన్నడం రెండు భాషలు మాట్లాడుతుంటారు. దీంతో రాహుల్ కి తమిళం, కన్నడం రెండు చిన్నప్పటి నుంచే వచ్చు. దేశంలో ఉన్న చాలా మందికి హిందీ భాష ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే అలా హిందీ కూడా నేర్చుకున్నాడు. మరోవైపు కే.ఎల్. రాహుల్ చదువుకునే సమయంలో ఇంగ్లీషు భాషను కూడా నేర్చుకున్నాడు. ఇలా రాహుల్ హిందీ, తమిళం, కన్నడం వంటి భాషలను నేర్చుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ కి ఇన్ని భాషలు వచ్చా..? అంటూ చర్చించుకోవడం విశేషం.
గెలుపు దిశగా ఇంగ్లాండ్..
ఇంగ్లాండ్ తో ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 471 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు 465 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 364 పరుగులు చేయగా.. అందులో కేఎల్ రాహుల్ 137 పరుగులు చేయడం విశేషం. మరోవైపు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా 118 స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లు అంతా తక్కువ స్కోర్ కే పరిమితమయ్యారు. బౌలర్లు ముగ్గురు డకౌట్ అయ్యారు. రాహుల్ తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 137 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. మరో 125 పరుగులు చేస్తే.. ఇంగ్లాండ్ జట్టును విజయం వరిస్తోంది. 52 ఓవర్లలో 246 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఓపెనర్ డకెట్ 143 పరుగులు చేసి ఇంకా క్రీజులోనే కొనసాగుతున్నాడు. మరో ఓపెనర్ 65 పరుగులు చేసి ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో రాహుల్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరో బ్యాటర్ పోప్ ను ప్రసిద్ క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. ప్రస్తుతం జో రూట్ క్రీజులో కొనసాగుతున్నాడు.