UPSC Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సూపర్ న్యూస్. వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు, వెకెన్సీలు, వయస్సు, దరఖాస్తు ప్రక్రియ, ఉద్యోగ ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025 ఇయర్ కు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖలలోని 462 గ్రూప్-ఏ & బీ స్థాయి ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 14వ తేదీ నుంచి జులై 3 వరకు ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 462
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్), అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా), కంపెనీ ప్రాసిక్యూటర్, డిప్యూటీ సూపరింటెండిగ్ హార్టి కల్చరిస్ట్, డిప్యూటీ ఆర్కి టెక్ట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఉద్యోగాలు వెకెన్సీలు:
1. అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్): 02
2. అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా): 03
3. కంపెనీ ప్రాసిక్యూటర్: 25
4. డిప్యూటీ సూపరింటెండింగ్ హార్టికల్చరిస్ట్: 02
5. డిప్యూటీ ఆర్కిటెక్ట్: 16
6. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 03
7. డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్): 15
8. అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియాక్ అనస్థీషియా): 3
9. అసిస్టెంట్ ప్రొఫెసర్ (డెర్మటాలజీ): 04
10. స్పెషలిస్ట్ గ్రేడ్-3 (మైక్రోబయాలజీ): 11
11. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆప్తాల్మాలజీ): 08
12. అసిస్టెంట్ ప్రొఫెసర్ (పబ్లిక్ హెల్త్): 09
13. అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియోథెరపీ): 08
14. మెడికల్ ఫిజిసిస్ట్: 02
15. డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (టెక్నికల్): 13
16. సైంటిస్ట్-బీ (జియాలజీ): 01
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతను నిర్ధారించారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ/బీఏ, బీఆర్క్, బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీబీఎస్, డీఎన్‌బీ, సీఏ, ఎంఎస్సీ, డిప్లొమా, ఎంవీఎస్‌సీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఎంసీహెచ్, డీఎం పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఏడవ సీపీసీ ప్రకారం పే మ్యాట్రిక్స్ లో లెవల్ 7 నుంచి లెవెల్ 11 వరకు ఉంటుంది. జీతం రూ.44,900 నుంచి రూ. 2,08,700 వరకు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 14
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూలై 3
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.25 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్ ఇదే: https://upsc.gov.in/
ALSO READ: RRB: ఇది అద్భుతమైన అవకాశం.. రైల్వేలో డిగ్రీతో భారీగా ఉద్యోగాలు, ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ బ్రో
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 462
దరఖాస్తుకు చివరి తేది: జూలై 3