KL Rahul To Play Ahead Of Sarfaraz Khan In 1st Test Against Bangladesh: భారత క్రికెట్ లో యువతేజం సర్ఫరాజ్ ఖాన్ ఎంపికైనా తుది జట్టులో స్థానం ఉంటుందా? అనే సందేహాలు అందరిలో వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్టులో కీలకమైన ఐదో స్థానం కోసం కేఎల్ రాహుల్.. సర్ఫరాజ్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ కూడా సీనియర్ అయిన కేఎల్ వైపే చూస్తున్నారని తెలిసింది.
ఎందుకంటే కేఎల్ రాహుల్ ఎన్నో సందర్భాల్లో జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఆదుకున్నాడు. అటు డిఫెన్స్ ఆడగలడు. అవసరమైన సందర్భాల్లో హిట్టింగ్ చేయగలడు. అందువల్ల మేనేజ్మెంట్ తనవైపే చూస్తోందని అంటున్నారు. ఇక ధ్రువ్ జురెల్ ని కూడా కేవలం స్టాండ్ బైగా మాత్రమే తీసుకున్నారని చెబుతున్నారు. ఒకవేళ రిషబ్ పంత్ ఏమైనా ఆడలేని స్థితిలో ఉంటే, తనకి అవకాశం వచ్చే అవకాశం ఉంది.
జట్టులో ఎవరైనా గాయపడితే, ఆ ప్లేస్ లో సర్ఫరాజ్ ని తీసుకోవాలనే ఉద్దేశంతోనే తనని ఎంపిక చేశారని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అందరి సందేహాలు పటాపంచలైపోయాయి. ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండు జట్లకి చాలా కీలకంగా మారనుంది. ఇక్కడ వచ్చే పాయింట్లను బట్టే డబ్ల్యూటీసీ వరల్డ్ కప్ ఫైనల్ ఆధారపడి ఉంటుంది.
తర్వాత కూడా ఇదే జట్టుని ఆస్ట్రేలియా వరకు తీసుకువెళతారా? లేదా? అనేది కూడా సందేహంగా ఉంది. నిజానికి బంగ్లాదేశ్ కి తొలిటెస్టు వరకే జట్టుని ఎంపిక చేశారు. ఇక్కడెవరైనా సరిగా ఆడకపోతే వారిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తారా? అని అంటున్నారు.
Also Read: ఇంగ్లండుని ఓడించారు.. శ్రీలంకకి ఓదార్పు విజయం
నిజానికి అద్భుతమైన టాలెంట్ బయట ఉండటంతో, ఇప్పుడు తుది జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి మ్యాచ్ జీవన్మరణ సమస్యగా మారింది. అదీకాక మెడమీద కత్తిలా ఒక టెస్టు మ్యాచ్ కి ఒక జట్టుని ఎంపిక చేయడం కూడా ఆటగాళ్లలో ఒత్తిడిని పెంచుతోందని అంటున్నారు. ప్రతి మ్యాచ్ అద్భుతంగా ఆడాలంటే ఎవరివల్ల సాధ్యమని అంటున్నారు. జట్టులో స్థానం నికరంగా లేకపోతే, ఏ ఆటగాడికి కూడా మనశ్శాంతిగా ఉండదని, నిద్రపట్టదని అంటున్నారు.
ఒక దేశంతో…ఆడే ఒక సిరీస్ కి ఒక జట్టుని ఎంపిక చేసి, అక్కడ ఆడకపోతే వేరే వాళ్లని ఎంపిక చేయాలి. లేదు మరీ అధ్వానంగా ఆడితే, సర్ఫరాజ్ లాంటి బెంచ్ మీద వాళ్లని దించి ఆడించాలని సూచిస్తున్నారు. ఈ తరహా ఎంపిక కూడా భారత జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తుందని అభిప్రాయ పడుతున్నారు.