BigTV English

KL Rahul : చరిత్ర సృష్టించిన రాహుల్ .. శభాష్ అంటున్న సీనియర్లు..

KL Rahul : చరిత్ర సృష్టించిన రాహుల్ .. శభాష్ అంటున్న సీనియర్లు..
KL Rahul

KL Rahul : సౌతాఫ్రికా గడ్డపై కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు.  సెంచూరియన్ గ్రౌండ్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఒంటరి పోరాటం చేసిన రాహుల్ సెంచరీ సాధించాడు. అలాగే 2021-22 లో సౌతాఫ్రికా పర్యటనకు రాహుల్ వచ్చాడు. అప్పుడిదే గ్రౌండ్ లో 123 పరుగులు చేశాడు. ఇలా ఒకే గ్రౌండ్ లో ఆతిథ్య జట్టు ఆటగాడు రెండు సెంచరీలు చేయడం రికార్డ్ గా చెబుతున్నారు.


ఓవర్‌నైట్ స్కోరు 208/8తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. అయితే 105 బంతుల్లో 70 పరుగులతో క్రీజులోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ రెండోరోజు ఆటలో 133 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. 95 పరుగుల వద్ద సిరాజ్ అవుట్ అయ్యాడు. దీంతో రాహుల్ సెంచరీ చేస్తాడా? లేడా? అని అంతా అనుకున్నారు. కానీ అదే ఓవర్ లో కొయెట్జీ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి సెంచరీ మార్క్ చేరుకున్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో బర్గర్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై రాహుల్ బౌల్డయ్యాడు.

అలా అద్భుతమైన, ఒక కళాత్మకమైన ఇన్నింగ్స్ కి తెరపడింది. మహా మహా ఆటగాళ్లందరూ సంకలో బ్యాట్ పెట్టుకుని, తలదించుకుని వెళ్లిపోతుంటే, బౌలింగ్ పిచ్ పై కుదురుకుని సెంచరీ చేయడమే కాదు, టీమ్ ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు వచ్చేలా రాహుల్ చేశాడు. ఆరో నెంబర్ బ్యాటర్ గా వచ్చి, టెయిల్ ఎండర్స్ తో కలిసి సెంచరీ చేయడమంటే మాటలు కాదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.


ముఖ్యంగా ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ రాహుల్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడని పొగడ్తలతో ముంచెత్తాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న సెంచూరియన్ పిచ్ పై రాహుల్ అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. లాఫ్టెడ్ షాట్లు, ఫుల్ షాట్లు, డిఫెన్స్ ఆడిన విధానం చాలా గొప్పగా ఉందని అన్నాడు.

మాజీ బ్యాటర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ కొత్త బంతిని ఎదుర్కోవడంలో రాహుల్ కి మంచి అనుభవం ఉందని అన్నాడు. ఓపెనర్ గా రావడం వల్లనే, ఇది టెస్ట్ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్స్ ని ఎదుర్కోడంలో ఉపయోగపడిందని తెలిపాడు. 1 నుంచి 6 స్థానాల్లో ఎక్కడైనా  ఆడే సామర్థ్యం రాహుల్ కి మాత్రమే ఉందని అన్నాడు. రాబోవు రోజుల్లో భారత క్రికెట్ ఆణిముత్యాల్లో తను ఒకడిగా ఉంటాడని తెలిపాడు.

Related News

IND VS PAK Final: ఇండియాను వ‌ణికిస్తున్న పాత రికార్డులు..అదే జ‌రిగితే పాకిస్థాన్ ఛాంపియ‌న్ కావ‌డం పక్కా ?

IND Vs PAK : నోరు జారిన షోయబ్ అక్తర్.. అభిషేక్ బచ్చన్ ను సీన్ లోకి లాగి

IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వ‌నున్న‌ నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!

IND Vs PAK : ‘షేక్ హ్యాండ్’ వివాదం పై పాకిస్తాన్ కెప్టెన్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

NEP-WI : నేపాల్ సరికొత్త చరిత్ర.. వెస్టిండీస్ జట్టుపై చారిత్రాత్మక విజయం 18వ ర్యాంక్ లో ఉండి వణుకు పుట్టించింది

IND vs PAK Final: నేడు ఆసియా క‌ప్‌ ఫైన‌ల్స్‌..పాండ్యా దూరం..టెన్ష‌న్ లో టీమిండియా, టైమింగ్స్‌..ఉచితంగా ఎలా చూడాలి

Asia Cup 2025 : టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ లో గెలిచేదెవ‌రు..చిలుక జోష్యం ఇదే

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్… బీసీసీఐ సంచలన నిర్ణయం.. బాయ్ కాట్ చేస్తూ

Big Stories

×