IND ENG Cricket stadiums : సాధారణంగా క్రికెట్ ఇంగ్లండ్ లో పుట్టింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తరువాత ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో క్రికెట్ కి మంచి డిమాండ్ పెరిగింది. క్రికెట్ ఆటగాళ్లకు ప్రపంచంలో ఏ దేశం ఇవ్వని విధంగా సాలరీలు ఇస్తుంది. అలాగే దీనికి తోడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా అత్యధిక ధర వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలోనే ఇండియాలోని అరుణ్ జైట్లీ స్టేడియం.. ఇంగ్లండ్ లార్డ్స్ మైదానం కి సంబంధించి ఓ న్యూస్ వైరల్ కావడం విశేషం. ఇండియాలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి రూ.19,000 కోట్లు ఖర్చు చేయగా.. లార్డ్స్ మైదానానికి కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ లార్డ్స్ మైదానం చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తోంది.
Also Read : Rishabh Pant – MLC : రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ కు 1.9 కోట్లు..MLC లీగ్ లో అందరూ ఆడిన కూడా అన్ని డబ్బులు రావు
ఇక భారత్ లోని అరుణ్ జైట్లీ స్టేడియం మాత్రం అంత ఇరుకు ఇరుకుగా కనిపించడం గమనార్హం. ఇంత డబ్బు ఖర్చు చేసి ఇలాంటి స్టేడియాన్ని నిర్మించలేకపోయారా..? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా కొందరూ రూ.20,000 కోట్లతో అయితే ఇంగ్లండ్ లార్డ్స్ లాంటి మైదానాలను మరో 4 నిర్మించేదని.. కేవలం ఒక్క మైదానానికి రూ.20వేల కోట్ల వరకు ఖర్చు చేయడం దారుణం అన్నారు. ఇండియా క్రికెట్ లో ఇంత దారుణం జరుగుతుందా..? అని రకరకాల కామెంట్స్ వినిపించడం విశేషం. ఇక టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగనుంది. భారత జట్టుకి శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్లతో సీనియర్లు లేకుండానే గిల్ సేన ఇంగ్లండ్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలోనే సీనియర్లు లేకుండా తమను తాము నిరూపించుకోవడానికి యువ ఆటగాళ్లకు ఇదే సరైన సమయం అని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. మరోవైపు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిని రెండు కోణాల్లో చూడవచ్చు. మొదటిది మనం ముగ్గురు అత్యంత అనుభవం కలిగిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలోకి దిగుతున్నాం. రెండో కోణం.. దేశం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి మన చేతుల్లో అద్భుతమైన అవకాశం ఉందని తెలిపాడు. ముఖ్యంగా మనం పోరాడటం ప్రారంభిస్తే.. ప్రతి సెషన్ ప్రతీ గంట, ప్రతీ బంతినీ మనం మనం చిరస్మరణీయంగా మలుచుకోగలం. దానిని ఈరోజు నుంచే ప్రారంభించండి. దేశం కోసం ఆడటం కంటే పెద్ద గౌరవం మరొకటి లేదని టీమిండియాతో పేర్కొన్నారు కోచ్ గంభీర్.