BigTV English
Advertisement

OTT Movie : అక్కడికి వెళ్తే తిరిగి రాలేరు… నిధి కోసం వెళ్తే చావు బాజా మోగింది… స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్

OTT Movie : అక్కడికి వెళ్తే తిరిగి రాలేరు… నిధి కోసం వెళ్తే చావు బాజా మోగింది… స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్

OTT Movie : నాగమలై అనే అడవి శతాబ్దాలుగా ఒక శాపంతో బంధించబడిన ఒక రహస్యమైన ప్రదేశం. ఇక్కడకు వెళ్లినవారు వెనక్కి వచ్చిన దాఖలాలు లేవు. ఈ స్టోరీలో హేమా అనే అమ్మాయి ఒక రచయిత అయిన మంజేరి కేశవన్ ను కలుస్తుంది. అతని రచనలు ఆమెను ఆకర్షిస్తాయి. కానీ ఆమె అక్కడికి రావడానికి అసలు కారణం వేరే ఉంటుంది. ఈ క్రమంలో కేశవన్ ఆమెకు నందివర్మన్ కథను చెబుతాడు. అతను అమూల్యమైన నాగ రాళ్ల కోసం నాగమలై అడవిలోకి ప్రవేసిస్తాడు. అయితే అడవిలోకి అడుగుపెట్టిన గ్రూప్‌లో ఒక్కొక్కరూ భయంకరమైన మరణాలను ఎదుర్కొంటారు. ఈ అడవిని శాసించే యాళి అనే ఒక భయంకరమైన జీవి, వీళ్ళను వెంటాడుతుంది. ఈ శాపం రహస్యం ఏమిటి? నందివర్మన్ అతని బృందం ఈ అడవి నుండి బయటపడగలరా ? ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

గజానా కథ రెండు టైమ్‌లైన్‌లలో సాగుతుంది. ఒకటి హేమా (వేదిక), మంజేరి కేశవన్ (హరీష్ పెరాడి) మధ్య, మరొకటి నందివర్మన్ (ఇనిగో ప్రభాకరన్) నేతృత్వంలోని ఒక సమూహంతో నడుస్తుంది. ఇక మొదటగా హేమా అనే అమ్మాయి, కేశవన్ రచనల గురించి తెలుసుకోవడానికి అతనిని కలుస్తుంది. కానీ ఆమె వచ్చిన నిజమైన కారణం క్రమంగా బయటపడుతుంది. ఈ క్రమంలో కేశవన్ ఆమెకు నాగమలై అడవి గురించి చెబుతాడు. ఇది శతాబ్దాల క్రితం ఒక శాపంతో బంధించబడిన ప్రదేశం. ఇందులోని నందివర్మన్ కథను హేమకు వివరిస్తాడు కేశవన్. నందివర్మన్ ఒక ధైర్యవంతుడైన వ్యకి. అమూల్యమైన నాగ రాళ్ల కోసం తన బృందంతో (విశ్వరూపి గా చాందినీ తమిళరాసన్, బందు గా యోగి బాబు, ఇతరులు) నాగమలై అడవిలోకి ప్రవేశిస్తాడు.ఈ రాళ్లు అపారమైన విలువను కలిగి ఉంటాయి. కానీ అడవిలోకి వెళ్లిన ఎవరూ తిరిగి రాలేదని పుకార్లు ఉన్నాయి.


వీళ్ళు అడవిలోకి ప్రవేశించిన కొద్ది సమయంలోనే అతీంద్రియ శక్తులను, యాళి అనే‌ పురాతన జీవిని ఎదుర్కొంటుంది. ఇది తమిళ సంస్కృతిలో ఒక శక్తివంతమైన, దైవిక సంరక్షకుడిగా చెప్పబడుతుంది. కానీ ఈ కథలో ఈ జీవి ఒక భయంకర రాక్షసిగా చిత్రీకరించబడింది. యాళి ఉనికి అడవి ప్రతి భాగంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన ఈ బృందంలోని సభ్యులు ఒక్కొక్కరూ భయంకరంగా చనిపోతుంటారు.ఈ బృందం అడవిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది పురాతన తమిళ పురాణాలు, నాగ రాళ్ల చుట్టూ ఉన్న ఒక కల్ట్‌తో ముడిపడి ఉంటుంది. ఇక నందివర్మన్, హేమా స్టోరీ కూడా క్రమంగా వీటితో కలుస్తాయి. చివరికి నందివర్మన్ నాగ రాళ్లను కనిపెడతాడా ? ఈ అడవిలో ఉన్న శక్తికి, నందివర్మన్ కి ఉన్న సంబంధం ఏమిటి ? కేశవన్ ను హేమా కలవడానికి అసలు కారణం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే

ఒక తమిళ సూపర్‌న్యాచురల్ ఫాంటసీ మూవీ ‘గజానా’ (Gajaana). దీనిని ప్రభాదిష్ సామ్జ్ దర్శకత్వం వహించి, నిర్మించారు. ఈ చిత్రంలో యోగి బాబు, ఇనిగో ప్రభాకరన్, చాందినీ తమిళరాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే హరీష్ పెరాడి, ప్రతాప్ పోతన్, సేంద్రయన్ వంటి ఇతర నటులు సహాయక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా నాగమలై అడవిలో జరిగే ఒక రహస్యమైన, శాపగ్రస్త కథ చుట్టూ తిరుగుతుంది. ఇందులో తమిళ పురాణాల నుండి స్ఫూర్తి పొందిన యాళి (Yaali) అనే పౌరాణిక జీవి కీలక పాత్ర పోషిస్తుంది. 1 గంట 48 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.1/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా 2025 మే 9న థియేటర్లలో విడుదలైంది. 2025 ఇది జూన్ 2 నుండి జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×