Avneet Kaur: క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. అందులో వారి ప్రేమ, పెళ్లి వంటి విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అభిమానులు. ఏ ప్లేయర్ ఎవరితో ప్రేమాయణం నడిపిస్తున్నాడు..? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు..? అనే విషయాలను తెలుసుకోవాలని క్రీడాభిమానులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు. అందుకే అలాంటి న్యూస్ బయటకి వస్తే పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి.
Also Read: Mayank Yadav Injury: లక్నోకు ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్ ఐపీఎల్ కు దూరం ?
అయితే ప్రస్తుతం అలాంటి వార్తే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. టీమిండియా యువ ఆటగాడు శుబ్ మన్ గిల్.. ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓపెనర్ బ్యాట్స్మెన్ గిల్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్ లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. నిలకడైన బ్యాటింగ్ తో జట్టు విజయంలో కీలకంగా మారుతున్నాడు. తాజాగా ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లోను వైస్ కెప్టెన్ గా వ్యవహరించి అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.
అయితే గిల్ గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో ప్రేమాయణం నడిపినట్లు పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ కొంతకాలం తర్వాత అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఇక తాజాగా ఐసిసి ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై విజయం సాధించిన భారత జట్టు.. మరో ఐసిసి ట్రోపీని తన ఖాతాలో వేసుకుంది.
దుబాయిలో జరిగిన ఈ మ్యాచ్ కి పలువురు బాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్ కూడా ఉంది. అయితే ఆమె ఈ మ్యాచ్ చూసేందుకు హాజరు కావడంతో.. గతంలో గిల్ అవినీత్ కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు.
అవినీత్ కౌర్.. గిల్ తో డేటింగ్ లో ఉన్నట్లు వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా గత సంవత్సరం గిల్ పుట్టినరోజు సందర్భంగా అవనీత్.. సోషల్ మీడియా వేదికగా అతడికి శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా గిల్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలను మరోసారి వైరల్ చేస్తూ వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. అతడిని చూసేందుకే ఆమె దుబాయ్ స్టేడియానికి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే మరికొందరు మాత్రం ఇవన్నీ పుకార్లేనని.. ఆమె రాఘవ్ శర్మ అనే నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. ఇక 26 ఏళ్ల అవినీత్ కౌర్.. 8 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈమె పలు బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటించింది. మొదటిసారిగా 2010లో డ్యాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్ షో లో కనిపించింది. ఇక కౌర్ చివరిసారిగా 2024 లో వచ్చిన “పార్టీ టిల్ ఐ డై” అనే మర్డర్ మిస్టరీలో నటించింది.