Shekhar Master.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ (Shekhar Master) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించే ఈయన.. ఇప్పుడు హుక్ స్టెప్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్పెషల్ సాంగ్ లో భాగంగా కొన్ని హుక్ స్టెప్ ల పేరుతో హీరోలు, హీరోయిన్లు చేస్తున్న మోషన్ స్టెప్ లపై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ ను గతంలో కొన్ని పాటల్లో గమనించగలిగినా.. తాజాగా ఈ అంశం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. దీనంతటికీ కారణం కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అంటూ.. ఆయన చూపించిన హుక్ స్టెప్ వల్లే అటు హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
కాంట్రవర్సీకి తెరలేపిన దబిడి దిబిడే సాంగ్..
ముఖ్యంగా ‘డాకు మహారాజ్’, ‘రాబిన్ హుడ్’ సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్, రొమాంటిక్ నంబర్లు ఇప్పుడు డిబేట్ కు దారితీస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘డాకు మహారాజ్’ సినిమాలో బాలకృష్ణ (Balakrishna), ఊర్వశీ రౌటేల (Urvashi Rautela) పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలెట్గా నిలిచింది. కానీ బాలకృష్ణ ఊర్వశీ మధ్య వచ్చిన ‘దబిడి దిబిడే’ అనే ఆ పాటలో ఊర్వశి బ్యాక్ పై బాలకృష్ణ కొట్టినట్లు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయడం విమర్శలకు దారితీసింది. ఇలాంటి సాంగ్స్ లో మితిమీరిన రొమాన్స్ ఎక్కువైందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
విమర్శలకు తెరలేపిన కేతికాశర్మ హుక్ స్టెప్..
అంతేకాదు రీసెంట్ గా వచ్చిన నితిన్ (Nithin) ‘రాబిన్ హుడ్’ సినిమాలోని “అది దా సర్ప్రైజ్” అనే పాటలో కేతిక శర్మ (Kethika Sharma) చేసిన హుక్ స్టెప్పు మరో వివాదానికి దారితీసిందిm ఈ పాటలో ఆమె మల్లెపూలను ఆభరణాలగా ధరించి.. స్టెప్పులు వేస్తున్న తీరు అలాగే నడుమును ప్లాంట్ చేస్తూ డిజైన్ చేసిన డాన్స్ మూమెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. హుక్ స్టెప్పుల పేరుతో డాన్స్ మూమెంట్స్ ను మరీ ఘాటుగా తీసుకెళ్లడం అనేది ఒక ట్రెండ్ గా మారిందని, ఇది చాలా వరకు అసహజంగా ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హాట్ టాపిక్ గా మారిన మిస్టర్ బచ్చన్ స్పెషల్ సాంగ్..
మరోవైపు ఈ రెండు సినిమాలకి ముందు వచ్చిన రవితేజ (Raviteja ) ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే (Bhagya Shri Borse)జంటగా స్టెప్ లు వేసిన పాటలు, కొన్ని స్టెప్పులపై కూడా నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రవితేజ తన చేతులను హీరోయిన్ బ్యాక్ ప్యాకెట్ లో పెట్టడం పట్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇకపోతే ఈ మూడు పాటలకి కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం ఆశ్చర్యం. స్పెషల్ సాంగ్స్ అంటే ఎక్కువగా శేఖర్ మాస్టర్ బెస్ట్ ఛాయిస్ అనేలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. కానీ ఆయన ఘాటైన స్టెప్పులతో కాంట్రవర్సీలో నిలుస్తుండడం అలవాటుగా మారిందని కూడా కామెంట్లు అంటున్నారు.
ఇక దీంతో కొరియోగ్రాఫర్ పై మండిపడుతూ ముఖ్యంగా లేడీస్ ని కాస్త మర్యాదగా చూపించు అంటూ నెటిజన్స్ సైతం కొరియోగ్రాఫర్ పై మండిపడుతున్నారు. మరికొంతమంది ఒక పాట స్క్రీన్ పై కనిపించింది అంటే అందులో దర్శకుడి నిర్ణయం కూడా ఉంటుంది. అతను ఓకే చెబితేనే మాస్టర్ కూడా అదే తరహాలో ముందుకు వెళ్తారు అంటూ మాస్టర్ కి వత్తాసు పలుకుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు శేఖర్ మాస్టర్ పై భారీగా ట్రోల్స్ వినిపిస్తున్నాయని చెప్పవచ్చు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==