IT raids On Sri Chaitanya: దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నైలో సుమారు 30 చోట్ల ఏకకాలంలో విస్త్రతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ కేంద్రంగా మాదాపూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న శ్రీచైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో చేపట్టిన సోదాల్లో 2కోట్లకుపైగా క్యాష్ గుర్తించినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజు తీసుకుని ట్యాక్స్ ఎగొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారు చేసి లావాదేవీలు నిర్వహిస్తూ.. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్ వేర్ తయారు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మాదాపూర్‌లోని శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలో రికార్డులు, డాక్యుమెంట్లు, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపు రశీదులను పరిశీలించారు. డైరెక్టర్ల కార్యాలయాలనూ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫీజుల విషయంలోనూ ఫిర్యాదుల రావడంతో ఈ కాలేజీలపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పలు కాలేజీలకు అనుమతులు లేవని, హాస్టల్ భవనాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని తేలింది.
పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. కళాశాలల యజమాన్యాలు వెల్లడించిన వివరాలు, సోదాల్లో లభించిన వివరాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. సంస్థల్లో చేరుతున్న విద్యార్థులు, ఆదాయానికి సంబంధించిన వాటిపై ఆరా తీస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన దానిపై అధికారులు దృష్టి సారించారు.
తాజాగా యలమంచిలి శ్రీధర్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. మొదట మాదాపూర్ బ్రాంచ్‌లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత యలమంచిలి శ్రీధర్ ఇంట్లో కూడా పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అటు.. ఖమ్మంలో ఉన్న మరో డైరెక్టర్ నివాసంలో సైతం తనీఖీలు చేయడానికి అధికారులు రెడీ అయ్యారు.
స్టూడెంట్స్ నుంచి ఫీజులు కట్టించుకొని ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టే విషయంలో అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. ట్యాక్సులు ఎగ్గొట్టడానికి శ్రీ చైతన్య యాజమాన్యం ప్రత్యేకంగా కొన్ని దారులు వెతుక్కున్నట్టు అధికారులు గుర్తించారు. విద్యార్థులతో లావాదేవీలు జరపడానికి సాఫ్ట్‌వేర్, ప్రభుత్వానికి కట్టే టాక్స్ కట్టడానికి మరో సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసుకున్నారు.
రెండు యాప్‌ల ద్వారా స్టూడెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేసినట్టు గుర్తించారు. దీంతో ఫీజుల చెల్లింపులకు రెండు యాప్‌లు ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. మొత్తం శ్రీచైతన్య విద్యాసంస్థలకు ఎన్ని బ్రాంచిలు ఉన్నాయి? ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్ పేమెంట్ చేశారు? ఎంత మంది నగదురూపంలో చెల్లించారు అనే వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
Also Read: బీహార్ ఎన్నికలకు కొత్త ఎజెండా.. ఆ ప్రాంతంలో సీతా దేవి ఆలయ నిర్మాణం
ఓన్లీ క్యాష్ ద్వారా కోట్ల రూపాయల ఫీజుల కట్టించుకొని ట్యాక్సులు ఎగ్గొట్టారని అధికారులు తేల్చారు . మాధాపూర్ బ్రాంచిలో 2 కోట్ల రూపాయలకు పైగా క్యాష్ గుర్తించారు. ఇక దీనితోపాటు.. పలు కాలేజీలకు, భవనాలకు అనుమతులు లేవని తేలింది. పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. పలు కీలక డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్ బ్రాంచ్‌లో అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఏపీ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులో మొత్తం 30 టీములు తనిఖీల్లో పాల్గోన్నాయి.