E-Paper
Advertisement

Virat Anushka Viral Video: లండన్‌లో విరాట్ కొహ్లీ ఫ్యామిలీ, కీర్తనలు వింటున్న వీడియో వైరల్‌!

Virat Anushka Viral Video: లండన్‌లో విరాట్ కొహ్లీ ఫ్యామిలీ, కీర్తనలు వింటున్న వీడియో వైరల్‌!
Advertisement

Kohli Anushka Krishnadas kirtans are buzzing in London: అపర కుబేరుడు రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ప్రముఖులు, సెలబ్రెటీస్ వారి వారి కుటుంబసభ్యులతో ఈ కార్యక్రమంలో సందడి చేశారు. కానీ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కొహ్లీ నటి అనుష్కశర్మ మాత్రం ఈ ప్రోగ్రామ్‌కి గైర్హాజర్ అయ్యారు. అంతేకాదు కొహ్లీ పొట్టి కప్‌కి గుడ్‌బై చెప్పాక తన ఫ్యామిలీతో లండన్‌కి వెళ్లిపోయాడు.తనకి బాబు పుట్టిన సమమంలో తన భార్యతో అంతగా స్పెండ్ చేయలేకపోయాడు.

ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌ గెలుపులో తన వంతు బాధ్యతను పోశించాడు. అయితే తన భార్య, పిల్లలు లండన్‌లో ఉండగా.. టోర్నీ ముగియగానే వీరితో గడిపేందుకు లండన్‌ ఫ్లైట్ ఎక్కాడు. అంతేకాదు లండన్‌లో కొహ్లీ, అనుష్కకి సంబంధించిన వీడియో రివీల్ అయింది. అంతేకాదు ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వారిద్దరు కలిసి కృష్ణదాస్ కీర్తనలు వింటూ సందడి చేశారు. ఈ వీడియో దూరం నుంచి ఓ వ్యక్తి తీయగా ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.ఇక వీరిద్దరు కలిసి ఈ సంకీర్తనలో లీనమైనట్లుగా ఈ వీడియోలో మనం చూడొచ్చు. అంతేకాదు చుట్టూ వందల మంది జనాలు.. జనాల మధ్య వీరిద్దరూ కలిసి కృష్ణదాస్ పాటలో లీనమైపోయారు. అంతేకాదు భక్తిలో భాగంగా చప్పట్లు కొడుతూ ఈ వీడియోలో కనిపించారు.గతేడాది కూడా వీరిద్దరు కృష్ణదాసు కీర్తనలో పాల్గొన్నారు.

Advertisement

Also Read: శ్రీలంక టూర్ కి.. పాండ్యా దూరం? నలుగురు సీనియర్లు గైర్హాజరు

కృష్ణదాసు 60వ దశకంలో భారత్‌కి వచ్చారు. ఈయనకి సంబంధించిన వీడియోలు చూసి ఇంప్రెస్ అయింది. తన కీర్తనలు తనకు ఎంతగానో నచ్చాయి. అందుకే ఆయన కీర్తనలను అస్సలు మిస్సవకుండా టైమ్ దొరికినప్పుడల్లా ఇలా కీర్తనల ప్రోగ్రామ్‌లో పాల్గొంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటున్నారు. అంతేకాకుండా అనుష్కశర్మ మూవీస్ ఏవీ కూడా అంగీకరించకుండా తన ఫ్యామిలీతో ఇలా లండన్‌లో గడుపుతోంది. అంతేకాదు వీరిద్దరు ప్యూచర్‌లో లండన్‌లోనే సెటిల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే తరుచూ లండన్‌కి వెళుతున్నారంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే వీరిద్దరు క్లారిటీ ఇచ్చేదాక పుల్‌ డీటెయిల్స్ తెలిసేలా లేవు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Virat Kohli Fan Page (@wrognxvirat)

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×