BigTV English

India’s tour of Sri Lanka 2024: శ్రీలంక టూర్ కి.. పాండ్యా దూరం? నలుగురు సీనియర్లు గైర్హాజరు

India’s tour of Sri Lanka 2024: శ్రీలంక టూర్ కి.. పాండ్యా దూరం? నలుగురు సీనియర్లు గైర్హాజరు

Hardik Pandya will miss ODI series against Srilanka due to Personal Reasons: టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది? అంటే ఎవరూ సమాధానాలు చెప్పలేకపోతున్నారు. శ్రీలంక టూర్ కి అందుబాటులో ఉండలేమని అప్పుడే విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా చెప్పారు. దీంతో బీసీసీఐ కూడా అంగీకరించిందనే వార్తలు వచ్చాయి. విరాట్, రోహిత్ శర్మ లను పక్కన పెడితే, బుమ్రాకి మాత్రం వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా అనుమతిచ్చారని అంటున్నారు.


ఇప్పుడు తాజాగా వీరి జాబితాలోకి హార్దిక్ పాండ్యా కూడా వచ్చి చేరాడు. అదేమిటి? శ్రీలంక పర్యటనకు తనని కెప్టెన్ గా చేశారు కదా.. అని అంతా అనుకున్నారు. కానీ తను వ్యక్తిగత కారణాల ద్రష్ట్యా శ్రీలంక వెళ్లలేకపోతున్నట్టు తెలిపాడు. అందుకు అనుమతి కోరితే, బీసీసీఐ కూడా అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రానుండటం.. సీనియర్లంతా ఒకరి తర్వాత ఒకరు అందుబాటులో లేకపోవడం సరైనది కాదని సీనియర్లు అంటున్నారు. దీని ద్వారా ఒక రాంగ్ మెసేజ్ వెళుతుందని అంటున్నారు. ఇది భవిష్యత్ టీమ్ ఇండియాకి మంచిది కాదని అంటున్నారు.


టూర్ కి వస్తారో, రారో తర్వాత విషయం.. కాకపోతే శ్రీలంక పర్యటనకు బయలుదేరే ముందు సీనియర్లందరూ అందుబాటులో ఉండాలని గౌతం గంభీర్ డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. ఎందుకంటే తన ఇంట్రడక్షన్ ప్రోగ్రాం ఒకటి ఉండాలని, తన మనసులో మాట వారికి తెలియజేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

Also Read: టీ 20కి సూర్యా అయితేనే బెస్ట్: బీసీసీఐ అధికారి
 
ఇదిలా ఉండగా.. వ్యక్తిగత కారణాలతోనే హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. అతనికి ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు. హార్దిక్ గాయపడ్డాడనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.’అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమైన నేపథ్యంలో టీమిండియాకు సారథ్యం వహించేది ఎవరా? అనేది చర్చనీయాంశమైంది.

ఇక కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ అందుబాటులో ఉన్నారు. మూడు టీ 20ల సిరీస్ కి.. ఎలాగూ సూర్యకుమార్ ఉండనే ఉన్నాడు కాబట్టి, మిగిలిన మూడు వన్డేల సిరీస్ కి వీరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×