BigTV English

Pakisthan – Kohli: కోహ్లీ, RCB జిందాబాద్..బాబర్ డౌన్ డౌన్ అంటూ పాక్‌ ఫ్యాన్స్‌ రచ్చ…!

Pakisthan – Kohli: కోహ్లీ, RCB జిందాబాద్..బాబర్ డౌన్ డౌన్ అంటూ పాక్‌ ఫ్యాన్స్‌ రచ్చ…!

Pakisthan – Kohli:  విరాట్ కోహ్లీకి  ( Virat Kohli ) పాకిస్తాన్ లో (Pakisthan )  మంచి క్రేజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు రుజువు అయింది. అయితే తాజాగా మరోసారి విరాట్ కోహ్లీ అంటే ఎంత ప్రేమ ఉందో పాకిస్తాన్ అభిమానులు తెలియజేశారు. కోహ్లీ కోహ్లీ… RCB, RCB అంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ చట్ల మధ్య వన్డేస్ ట్రై సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే.


Also Read: Telugu Warriors – CCL 2025: ఉప్పలో తమన్‌ మాస్‌ డ్యాన్స్..తెలుగు వారియర్స్‌ విక్టరీ !

అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో ( Karachi National stadium ) జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా… పాకిస్తాన్ అభిమానులు ( Pakisthan Fans )… కరాచీ స్టేడియం ( Karachi stadium ) దగ్గర సందడి చేశారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత.. బయటకు వచ్చి విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అంటూ అరిచారు. అదే సమయంలో ఆర్సిబి నామస్మరణం చేస్తూ మరచిపోయారు. మరి కొంతమంది అయితే… పాకిస్తాన్ బాబర్ అజాం.. డౌన్ డౌన్… విరాట్ కోహ్లీ జిందాబాద్ (  Virat Kohli Zindabad) అంటూ స్లొగన్స్ కూడా ఇచ్చారు.


Also Read: Nz vs Pak Final: చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. సొంత గడ్డపై చిత్తు?

ఇది ఇలా ఉండగా కరాచీ లోని నేషనల్ స్టేడియంలో నిన్న జరిగిన వన్డే ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మరోసారి బాబర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు పైన న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి… వన్డే ట్రై సిరీస్ సొంతం చేసుకుంది. చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటు కంటే ముందు… సన్నాహక సిరీస్ లో భాగంగా ఈ వన్డే సిరీస్ నిర్వహించారు. అయితే ఈ టోర్నమెంటులో సొంత గడ్డపై పాకిస్తాన్ మట్టి కరిచింది. ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ).. మరో నాలుగు రోజుల్లోనే ప్రారంభం కానుంది.

ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. హైబ్రిడ్ మోడల్ లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… టీమిండియా మ్యాచ్ లన్ని దుబాయిలో జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్ టీంతో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత.. ఆదివారం రోజున అంటే..  ఫిబ్రవరి 23వ తేదీన ఆతిధ్య పాకిస్థాన్ జట్టుతో  తలపడుతుంది టీమిండియా. కాగా  ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం ఇవాళ సాయంత్రం.. దుబాయ్ కు టీమిండియా వెళ్లే ఛాన్సులు ఉన్నాయి.  ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×