Laila Day 1 Collections : టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( viswak Sen ) రీసెంట్ గా నటించిన చిత్రం లైలా.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి ( Sahu Garapati ) నిర్మించారు.. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. అయితే విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయడం.. అతని స్టైల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాను ప్రమోట్ చేయడం, చిరంజీవి ప్రీ రిలీజ్ కి వచ్చి సినిమాను ప్రమోట్ చేయడం వల్ల సినిమాకు ప్లస్ అవుతుందని అనుకున్నారు. కానీ మొదటి షో తో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..
లైలా బిజినెస్ డీటెయిల్స్..
విశ్వక్ సేన్ గత ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి, మెకానిక్ రాఖీ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూడు సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది మొదటగా లైలా మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీని సుమారుగా 35 కోట్ల రూపాయలతో పెట్టినట్లు తెలుస్తుంది. అయితే టైటిల్ అనౌన్స్‌మెంట్, టీజర్, ట్రైలర్ లాంటి కంటెంట్, అలాగే వివాదాస్పద అంశాలు ఈ సినిమాకు సానుకూలంగా మారాయి. ఈ సినిమాపై ఓ రేంజ్ క్రేజ్ఏర్పడింది.. ఇక తాజాగా ఈ మూవీ బిజినెస్ వైరల్ గా మారింది..
Also Read : ‘తండేల్ ‘ వసూళ్ల సునామీ.. ఎన్ని కోట్లు వసూల్ చేసిందంటే..?
లైలా కలెక్షన్ చూస్తే..
ఏపీ, నైజాం సెంటర్ల రైట్స్ సుమారుగా 6 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7 కోట్ల షేర్, 14 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని తెలుస్తుంది. మొత్తానికి ఈ మూవీకి 8 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కానీ ఈ మూవీ లాభాల్లో కి రావాలంటే 10 కోట్లు వరకు రాబట్టాల్సి ఉంది. అయితే భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ మొదటి రోజు డీలా పడిందనే టాక్ వినిపిస్తుంది. థియేటర్లలోకి రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా తక్కువగానే వసూల్ చేసిందనే వార్తలు సోషల్ మీడియా లో ప్రచారంలో ఉన్నాయి. లైలా మూవీ మొదటి రోజున కోటి రూపాయల లోపే వసూలు చేస్తుందని ఓ వార్త అయితే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. లైలా మూవీ కలెక్షన్స్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.. ఏది ఏమైనా కూడా మొదటి రోజు ఎవరెస్టును అందుకున్న ఈ మూవీ వీకెండ్ కావడంతో శనివారం, ఆది వారాల్లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏమాత్రం వసూల్ చేస్తుందో..