Nz vs Pak Final: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందు పాకిస్తాన్ జట్టుకు ( pakisthan ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్వదేశంలో జరిగిన వన్డే ట్రై సిరీస్ లో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఫైనల్ మ్యాచ్ లో… పాకిస్తాన్ జట్టుపై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది న్యూజిలాండ్. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు… పాకిస్తాన్ గడ్డపై.. ట్రై సిరీస్ గెలిచి… డేంజర్ బెల్స్ పంపింది న్యూజిలాండ్ ( New Zealand ).
Also Read: BCCI New Rules: 27 బ్యాగులు తీసుకెళ్లి.. కొంపముంచిన టీమిండియా ప్లేయర్..?
ఈ ఫైనల్ మ్యాచ్ లో డేవాన్ కాన్వే…మిచెల్, కేన్ మామ, లాతమ్ అందరూ సమిష్టిగా రాణించడంతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది న్యూజిలాండ్. రచిన్ రవీంద్రా లాంటి ఆల్ రౌండర్ లేకపోయినా… ఫైనల్ మ్యాచ్ లో దుమ్ము లేపింది. ఇక అటు స్వదేశంలో… ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు వన్డే ట్రై సిరీస్ ఓడిపోయి… మరింత ప్రెషర్ లోకి వెళ్ళింది పాకిస్తాన్. సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ అలాగే న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై సిరీస్… ఇటీవల ప్రారంభమైంది. అయితే ఇందులో సౌత్ ఆఫ్రికా ఎలిమినేట్ కాగా… పాకిస్తాన్ అలాగే న్యూజిలాండ్ ఫైనల్ కు చేరాయి. ఈ ఫైనల్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైంది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో… ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో మొదట పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. ఇక.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. అత్యల్ప స్కోరు చేయగలిగింది. 49.3 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ టీమ్.. 242 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
పాకిస్తాన్ బ్యాటర్లలో… ఆ జట్టు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘ, తాహిర్ మినహా ఏ బ్యాట్స్మెన్ కూడా పెద్దగా రాణించలేదు. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు బాబర్ అజాం… ఈ వన్డే ట్రై సిరీస్ లో అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ 46 పరుగులు చేయగా.. సల్మాన్ 45 పరుగులు చేసి రాణించాడు. అటు తాహీర్ 38 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ లో అయినా రాణిస్తాడు అనుకున్న బాబర్ అజాం 29 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ తరుణంలోనే 242 పరుగులు మాత్రమే చేసింది పాకిస్తాన్.
Also Read: Telugu Warriors Team: ఉప్పల్ లో తెలుగు వారియర్స్ రచ్చ… కుర్చీ మడతపెట్టి అంటూ !
న్యూజిలాండ్ బౌలర్లలో… విలియం… ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ కు చుక్కలు చూపించాడు. అలాగే బ్రేస్ వెల్, మిచెల్ శాంట్ణర్ తలో రెండు వికెట్లు తీశారు. ఇక ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో… న్యూజిలాండ్ జట్టు ఆచితూచి ఆడింది. పాకిస్తాన్ ఇచ్చిన టార్గెట్ ను 45.2 ఓవర్లలో ఫినిష్ చేసింది న్యూజిలాండ్. కేవలం 5 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ జట్టు… 243 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ తరుణంలోనే పాకిస్తాన్ జట్టు పైన ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో వన్డే ట్రై సిరీస్ గెలుచుకుంది న్యూజిలాండ్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందు ఈ సిరీస్ గెలుచుకొని… అన్ని జట్లకు డేంజర్ బెల్స్ పంపింది కివీస్. అటు సొంత గడ్డపై వన్డే సిరీస్.. ప్రమాదంలో పడింది పాకిస్తాన్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్న పాకిస్తాన్.. సొంత గడ్డపై ఈ ట్రై సిరీస్ ఓడిపోవడం చాలా బాధాకరం.