Telugu Warriors – CCL 2025: ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 ( Celebrity Cricket League 2025 ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు వారియర్స్… టాలీవుడ్ నుంచి బరిలో ఉంది. అక్కినేని అఖిల్ ( Akhil Akkineni ) ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు వారియర్స్ ( Telugu Warriors )… నిన్న రాత్రి జరిగిన ఉప్పల్ స్టేడియంలో అదరగొట్టింది. భోజ్ పూరి దబాంగ్స్ ను ఒక ఆట ఆడుకుంది తెలుగు వారియర్స్. ఈ తరుణంలోనే ఉప్పల్ స్టేడియంలో భోజ్ పూరి దబాంగ్స్ టీం పైన తెలుగు వారియర్స్ ఏడు పరుగులతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరి వరకు ఉత్కంఠ కొనసాగిన ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ పోరాడాల్సి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో ( Hyderabad ) భోజ్‌పురి దబాంగ్స్‌పై ఏడు పరుగుల తేడాతో త్రిల్లర్ విజయాన్ని నమోదు చేసుకుంది తెలుగు వారియర్స్.
Also Read: Nz vs Pak Final: చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. సొంత గడ్డపై చిత్తు?
అయితే… భోజ్‌పురి దబాంగ్ ( Bhojpuri Dabanggs ) వర్సెస్ తెలుగు వారియర్స్ మధ్య జరిగిన నిన్నటి ఉప్పల్ మ్యాచ్ లో ( Uppal Match ) ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో… టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ , తెలుగు వారియర్స్ ప్లేయర్ ఎస్ ఎస్ తమన్ గ్రౌండ్ లోనే స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు వారియర్స్ జట్టు బ్యాటింగ్ చేసే క్రమంలో… టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ( Ss Thaman Dance) డాన్స్ చేయడం జరిగింది. తెలుగు వారియర్స్ జట్టు 50 పరుగులు పూర్తయిన నేపథ్యంలో… అదిరిపోయే డ్యాన్స్ తో రెచ్చిపోయాడు ఎస్ ఎస్ తమన్. బ్యాట్ పైకి లిఫ్ట్ చేసి… చిన్నపిల్లడిలా డాన్స్ చేశాడు తమన్.
అయితే ఆ సమయంలో బౌండరీ కొట్టిన తమన్ ( Ss Thaman ).. గ్రౌండ్ లో వచ్చిన మ్యూజిక్ కు స్టెప్పులు వేయడం జరిగింది. దీంతో తమన్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో… తమ ముఖం కనిపించలేదు కానీ… ఆయన డాన్స్ చేసేది మాత్రం స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో కామెంట్ బాక్స్ లో ఉన్న… వ్యక్తి కూడా తమన్ డాన్స్ చేస్తున్నాడని.. మైక్ లో వ్యాఖ్యానించాడు. దీంతో ఈ సన్నివేశం మరింత వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్ లో భోజ్‌పురి దబాంగ్స్‌పై ఏడు పరుగుల తేడాతో త్రిల్లర్ విజయాన్ని నమోదు చేసుకుంది తెలుగు వారియర్స్.
కాగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ మొదటి ఇన్నింగ్స్ లో నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 80 పరుగులు చేసింది. ఆ తర్వాత భోజ్ పురి నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసి దుమ్ము లేపింది. కానీ రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం తెలుగు వారియర్స్ పికప్ అందుకుంది. దీంతో నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది తెలుగు వారియర్స్. అటు భోజ్ పురి రెండవ ఇన్నింగ్స్ లో 79 పరుగులకు కుప్పకూలింది. దీంతో తెలుగు వారియర్స్ బ్రాండ్ విక్టరీ కొట్టింది.
Also Read: Lalit Modi – Sushmita Sen: 61 ఏళ్లలో లలిత్ మోడీ ఘాటు ప్రేమ.. మంచి ఆటగాడే ?
Glecheysam🎊🎊 @MusicThaman 🔥 @AkhilAkkineni8 🔥@imashwinbabu 🔥 @iamaadisaikumar 🔥 #AkhilAkkineni #TeluguWarriors #BhojpuriDabanggs #CelebrityCricketLeague #CCL #CCL2025 #KKUR #KurrolamKadhaUdukuRaktham pic.twitter.com/Zz1xWCrDYo
— kurrolam kada uduku raktham (@kurrolam) February 14, 2025