BigTV English

Jr. NTR: వంశీ ఇంట బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

Jr. NTR: వంశీ ఇంట బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

Jr. NTR:సెలబ్రిటీ ఇంట్లో ఏ వేడుకైనా అందరూ కలిసి జరుపుకోవడం, ఆ పార్టీలో తీసుకున్న ఫోటోలను, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. హీరో, హీరోలకి మధ్య వ్యత్యాసం ఉండదని, ఇలాంటి పార్టీల ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. పార్టీ ఏదైనా అందరూ ఒక చోట కలవడం, ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకోవడం, అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం. వంశీ పైడిపల్లి భార్య మాలిని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీకి సుకుమార్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ హాజరయ్యారు. ఇక్కడ ఒక హీరో మిస్ అయ్యారు.. అతను ఎవరు ఎందుకు రాలేదు.. ఆ పార్టీ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


వంశీ ఇంటికి జూనియర్ ఎన్టీఆర్.. మహేష్ మిస్

గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిపిన దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈసారి మహేష్ మాత్రం వంశీ భార్య బర్త్డే కి మిస్ అయ్యాడు. మహేష్ వంశీ ఇంటికి ఎప్పుడు ఫ్యామిలీతో సహా వస్తాడు. అలాంటిది ఈసారి మహేష్ ఫ్యామిలీ రాలేదు. ఎందుకంటే మహేష్, దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా షూట్ లో బిజీగా వున్నాడు. ఈరోజు వంశీ పైడిపల్లి భార్య మాలిని పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్, ప్రశాంత్ నీల్ వచ్చారు. మహేష్ బాబు కూడా వచ్చి ఉంటే ఆ ఫోటో ఇంకా కలర్ ఫుల్ గా ఉండేది.


పార్టీ కి వచ్చిన ప్రశాంత్ నీల్, సుకుమార్ డైరెక్టర్స్

తారక్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, వంశీ కాంబోలో వచ్చిన బృందావనం సినిమాలోని కామెడీ సీన్స్ ఇప్పటికి సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాయి. వారితో పాటు ఈ పార్టీకి లెజెండ్ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’ రావడం విశేషం. ‘సలార్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. రాబోయే సినిమాకు ముందుగానే డైరెక్టర్ తో కలిసి తారక్ ఇలా పార్టీలో కనబడడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. వీరితోపాటు వంశీ కుమార్తె ఆధ్యా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

సినిమా విషయానికి వస్తే.. పుష్ప 2 తో సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న సుకుమార్ ఇప్పుడు ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైజ్ గా రూ.1000 కోట్లు దాటి మరోసారి తెలుగు సినిమా సత్తా ఏమిటో చూపింది. తరువాత రామ్ చరణ్ తో RC17 ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే బాలీవుడ్ లోఎంట్రీ ఇస్తూ ‘వార్ 2’ లోహృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. 2019లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”వార్ కి సీక్వెల్ గా ఈ సినిమా రానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×