Kris Srikkanth: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 (ICC Women’s T20 World Cup 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా మొన్న ఆదివారం రోజున టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా అద్భుతంగా రాణించి టీమిండియా మహిళల జట్టు విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో చెత్తగా ప్రదర్శన చేసి ఓడిపోయింది. అయితే ఈ ఓటమి నేపథ్యంలో తాజాగా క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లు అందరూ కూడా క్రికెట్ ఆడడం మానేస్తే బెటర్ అంటూ హేళన చేశారు. క్రికెట్ స్థానంలో ఇంట్లో కూర్చోవడం లేదా కర్ర బిళ్ల ఆడుకోవడం బెటర్ అంటూ సూచనలు చేశారు. వాళ్లకు అసలు క్రికెట్ ఆడడం చేతకావడం లేదని.. ప్రతిసారి టీమిండియా చేతిలో ఓడిపోతున్నారని బాంబు పేల్చారు. అందుకే క్రికెట్ మానేయడం బెటర్ అంటూ హితువు పలికారు. దీంతో క్రిస్ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. అయితే టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు పరుగులు అమాంతం గంగలో కలిపారు క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth). ఇకపై క్రికెట్ ఆడటం కంటే… కర్ర బిళ్ల ఆడుకోండి అంటూ పాకిస్తాన్ పరువు తీశారు. అది కూడా చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని హితువు పలికారు. ఒకప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడి చూసేవారని వెల్లడించారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే.. ఆ రోజు యుద్ధం జరిగినట్లుగానే ఫీల్ అయ్యేవారని గుర్తు చేశారు.
కానీ ఒకప్పటిలా పాకిస్తాన్ ప్లేయర్లు ( Pakistan) ఎవరూ ఆడడం లేదని సెటైర్లు పేల్చారు. మొన్నటి వరకు పురుషుల పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీమ్ ఇండియా చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మహిళలు కూడా దిగజారి ఆడుతున్నారని వెల్లడించారు. ఇలా వరుసగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడిపోతే… వాళ్ల పరువు పోతుందని చురకలు అంటించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని… క్రికెట్ మానేయండి అని వెల్లడించారు. దీంతో క్రిస్ శ్రీకాంత్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.