Delhi Premier League 2026 Run Out: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Delhi Premier League 2026) ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో ఓ అరుదైన రనౌట్ (run out ) సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ అయింది. హిమ్మత్ సింగ్ ( Himmat Singh run out) అనే కుర్రాడు ఆవేశంతో బంతిని ఫుట్ బాల్ లా తన్నాడు. ఈ క్రమంలో ఆ బంతి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో ప్రత్యర్థి బ్యాటర్ రనౌట్ అయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు అవాక్కు అవుతున్నారు. ఓరి నీ దుంపతెగ..ఇదెక్కడి రనౌట్ రా నాయనా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ జులై 31వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఆగస్టు 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 8 మ్యాచులు పూర్తయ్యాయి. లేటెస్ట్ గా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ( Arun Jaitley Stadium, Delhi) న్యూఢిల్లీ టైగర్స్ vs ఔటర్ ఢిల్లీ వారియర్స్
(New Delhi Tigers vs Outer Delhi Warriors) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగగా… మ్యాచ్ డ్రా అయింది. అయితే సూపర్ ఓవర్ లో మాత్రం ఔటర్ ఢిల్లీ వారియర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ నిన్న మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం కాగా… వర్షం అడ్డంకి గా మారింది. దీంతో 15 ఓవర్ల మ్యాచ్ నిర్వహించారు.
ఈ క్రమంలో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూఢిల్లీ టైగర్స్ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 155 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో చివరి వరకు పోరాడిన ఔటర్ ఢిల్లీ వారియర్స్, లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. న్యూఢిల్లీ టైగర్స్ చేసిన పరుగులకు సమానంగా ఔటర్ ఢిల్లీ వారియర్స్ కూడా చేశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో న్యూఢిల్లీ టైగర్స్ ఆటగాడు హిమ్మత్ సింగ్ చేసిన రన్ అవుట్ హిస్టరీలో నిలువనుంది. చేజింగ్ సమయంలో చివరి బంతికి సింగిల్ తీస్తే, ఔటర్ ఢిల్లీ వారియర్స్ విజయం సాధిస్తుంది.
ఆ సమయంలో శివమ్ శర్మ స్ట్రైకింగ్ లో ఉన్నాడు. మరోవైపు ప్రథమ్ సలుజా (Pratham Saluja) బ్యాటింగ్ కు దిగాడు. అయితే చివరి బంతికి శివమ్ శర్మ సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో లెగ్ సైడ్ అంపైర్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న హిమ్మత్ సింగ్ బంతిని పట్టుకునే క్రమంలో విఫలమయ్యాడు. బంతి మిస్ అయిందన్న కోపంతో ఫుట్ బాల్ లాగా తన్నాడు. దీంతో ఆ బంతి నేరుగా కీపర్ దగ్గరి వికెట్లకు తగిలింది. ఈ దెబ్బకు ప్రథమ్ సలుజా రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో ఈ రన్ అవుట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
What a run out by Himmat Singh 💥
A run out,out of nowhere in Delhi Premier League pic.twitter.com/sqVDV5ieSo— StrangerMan (@_StrangerMan7) August 4, 2026