
ks Bharat:- ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా ఆడేది విశాఖకు చెందిన కె.ఎస్.భరతే. కె.ఎల్.రాహుల్ ఉన్నా సరే వికెట్ కీపర్‌గా భరత్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎక్స్‌పర్ట్స్. పైగా ఆడిన ఫస్ట్ సిరీస్‌లోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సీజన్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్‌తో ఫస్ట్ టైం టెస్టుల్లోకి వచ్చాడు భరత్. లబుషేన్‌ను తొలి స్టంపౌట్‌గా ఔట్ చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో తొలి టెస్ట్‌లో ఓ స్టంపౌట్, ఓ క్యాచ్ పట్టాడు భరత్. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆరు క్యాచ్‌లు పట్టాడు. నాలుగో టెస్ట్‌లో 44 పరుగుల కెరీర్ బెస్ట్ స్కోర్‌తో మొత్తంగా 101 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో వచ్చి 67, ఏడో స్థానంలో వచ్చి 26, ఎనిమిదో స్థానంలో వచ్చి 8 పరుగులు చేశాడు.
కె.ఎస్. భరత్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. వికెట్ కీపింగ్ అద్భుతంగా చేయగలడు. బ్యాట్స్ మెన్‌తో పాటు వికెట్ కీపింగ్ చేయగలగడం వల్లే భరత్‌కు భారత జట్టులో అవకాశం దక్కింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 86 మ్యాచ్‌లు ఆడిన భరత్.. 9 సెంచరీలు చేశాడు. అందులో హైయెస్ట్ స్కోర్ 308 పరుగులు, ఇండియా-ఎ జట్టుకు ఆడి ఆరు సెంచరీలు చేశాడు. ఇందులో హైయెస్ట్ స్కోర్ 161 పరుగులు. ఈ పర్ఫామెన్స్ కారణంగానే.. భరత్‌కు భారత జట్టులో చోటు దక్కింది.
విశాఖ నుంచి భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించిన తొలి క్రికెటర్ భరతే. అలాగే వికెట్ కీపర్‌గా ఆంధ్రా నుంచి ఎం.ఎస్.కె.ప్రసాద్ తర్వాత రెండో క్రికెటర్‌గా గుర్తింపు పొందింది కూడా కె.ఎస్.భరతే. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్టులో జడేజా వేసిన బంతితో లబుషేన్‌ను క్షణాల్లో స్టంప్ ఔట్ చేసి తన వికెట్ కీపింగ్ ఎలా ఉంటుందో చూపించాడు.
పంత్ గాయపడి అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ భరత్‌కు అవకాశం ఇచ్చింది. పైగా సెకండ్ ఫ్రంట్‌లైన్ వికెట్‌కీపర్‌గా ఉన్నది భరత్ ఒక్కడే. అందుకే, అన్నీ ఆలోచించి కె.ఎస్. భరత్‌కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు లండన్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో భారత్ తలపడనుంది.
భరత్ ఇప్పటి వరకు ఆడినన్నీ ఇండియన్ పిచ్‌ల మీదే. ఫస్ట్ టైం… విదేశీ గడ్డపై ఆడుతున్నాడు. అది కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ పోరులో ఆడుతుండడం విశేషం.