BigTV English

kusal mendis : జయసూర్య రికార్డు బ్రేక్ చేసిన కుశాల్ మెండిస్…

kusal mendis :  జయసూర్య రికార్డు బ్రేక్ చేసిన కుశాల్ మెండిస్…
kusal mendis

kusal mendis : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్స్ చెలరేగి ఆడారు. మొన్న సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైన లంకవాసులు ఈసారి తమ ప్రతాపం చూపించారు. ఫీల్డ్ లో ఉన్నంతసేపు కదం తొక్కుతూ సమర విక్రమ్ తన సెంచరీ తో పాకిస్తాన్ బౌలర్లను బెంబేలు పెట్టాడు. మరోపక్క కుషాల్ మెండిస్…. దూసుకు వస్తున్న బాల్ లను లెక్కచేయకుండా మెరుపు సెంచరీ చేసి శ్రీలంక భారీ స్కోర్ చేయడానికి కారణం అయ్యాడు. కుశాల్ 77 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు ,6 సిక్స్లు బాది 122 పరుగులు సాధించాదు. మరోపక్క సమర విక్రమ్ 108 పరుగులు చేయడంతో 9 వికెట్ల నష్టానికి శ్రీలంక 344 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.


సౌత్ ఆఫ్రికా తో ఆడిన మ్యాచ్ లో టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక ..రెండవ మ్యాచ్ లో తెలివితేటలు ప్రదర్శించి టాస్ గెలిచినప్పటికీ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది. అదే శ్రీలంకకు ఇప్పుడు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ లోకి దిగిన రెండవ ఓవర్ లోనే హసన్ అలీ వేసిన బాల్ కి పెరీరా డకౌట్ అవ్వడం తో శ్రీలంకకు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. అయితే ఆ తరువాత క్రేజ్ లోకి వచ్చిన కుశాల్ మెండిస్ …బ్యాటింగ్ చేసినంత తన ఎదురుగా బౌలర్ ఎవరు అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఉతికి ఆరేశాడు. సునాయాసంగా బంతిని బౌండరీ వైపు పరిగెత్తించడమే కాకుండా పాక్ ప్లేయర్లను గ్రౌండ్ మొత్తం పరిగట్టించాడు. మొత్తానికి 77 బంతులలో 122 పరుగులు సాధించి వన్డేలలో మూడో సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా ఇదే కావడం విశేషం.

అతను ఈరోజు సాధించిన సెంచరీ తో వన్డే ప్రపంచ కప్ లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన శ్రీలంక బాటర్ గా అతను రికార్డ్ సృష్టించాడు. 2015 వరల్డ్ కప్ లో సంగార్కర్ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 70 బంతుల్లో సెంచరీ చేయగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 73 బంతుల్లో సెంచరీ సాధించి అత్యంత వేగంగా సెంచరీ చేసిన శ్రీలంకన్ బ్యాటర్స్ లిస్టులో ఇప్పటివరకు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతూ వచ్చాడు. అయితే 65 బంతులలో సెంచరీ పూర్తి చేసి కుశాల్ మెండిస్ ఆ రికార్డును బద్దలు కొట్టి అత్యంత వేగంగా సెంచరీ చేసిన శ్రీలంక బాటర్ లిస్టులో ప్రథమ స్థానాన్ని తన వశం చేసుకున్నాడు.


అంతేకాదు ఈ మ్యాచ్ లో ఆరు సిక్సులు బాదిన కుశాల్ మెండిస్…. ఇప్పటివరకు ప్రపంచ కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన లంక క్రికెటర్ గా ఇప్పటివరకు సనత్ జై సూర్య పేరు మీద ఉన్న రికార్డును కూడా సమం చేశాడు. 2007 ప్రపంచ కప్ లో సనత్ జై సూర్య 14 సిక్సర్లు కొట్టాడు…అయితే ఇప్పుడు 2023 వన్డే ప్రపంచ కప్ లో రెండు మ్యాచ్లు ఆడిన కుశాల్ మెండిస్ అప్పుడే ఆ రికార్డును సమం చేశాడు. మరి ముందు జరగబోయే మ్యాచ్లలో మరింత సత్తా చాటుతాడేమో చూడాలి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×