Abhishek Sharma : సన్ రైజర్స్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ నిన్న పంజాబ్ కింగ్స్ పై కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 55 బంతుల్లో 141 పరుగులు చేసి అందరి మన్ననలు పొందాడు. ఈ సందర్భంలోనే సెంచరీ చేసిన సందర్భంగా ఓ నోట్ రిలీజ్ చేశాడు అభిషేక్. అయితే నోట్ చూపిస్తున్న సమయంలోనే టాలీవుడ్ బ్యూటీ లహరీ శ్రీ అభిషేక్ శర్మ కు కిస్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Also Read : Rishabh Pant : రిషబ్ పంత్ కు సీఎం యోగి బంపర్ ఆఫర్
పంజాబ్ కింగ్స్ పై భారీ శతకంతో సన్ రైజర్స్ విజయంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు లక్ష్య ఛేదన సమయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. గతంలో మార్కస్ స్టాయినిస్ 124 పేరిట ఉన్న రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. ఈ సీజన్ లోని గత 5 మ్యాచ్ ల్లో కేవలం 51 పరుగులే చేసిన అభిషేక్.. పంజాబ్ పై విరుచుకుపడ్డాడు. దీంతో 246 పరుగుల టార్గెట్ ను హైదరాబాద్ 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ నేపథ్యంలో వికెట్ల వెనుకగా క్రికెటింగ్ షాట్లు ఆడి అభిషేక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. గతంలో ఎప్పుడూ ఇలాంటి షాట్లు కొట్టలేదని స్వయంగా అతడే వెల్లడించడం విశేషం.
పంజాబ్ బౌలర్లను ఉతికారేస్తూ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ సాధించిన తరువాత అభిషేక్ ప్రత్యేకమైన స్లిప్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. సెంచరీ చేసిన తరువాత తన జేబులోంచి స్లిప్ తీసి అందరికీ చూపించాడు. అభిషేక్ చూపించిన కాగితం మీద ఈ శతకం ఆరెంజ్ ఆర్మీ కోసమే అని రాసి ఉంది. వరస ఓటములతో సన్ రైజర్స్ ప్రేక్షకులను నిరాశపరుస్తుండగా.. ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్న వేళ అభిషేక్ ముందుగానే గెలుపుని ఊహించి పేపర్ మీద రాసుకొచ్చి ఊచకోతకు తెరలేపాడు. తన ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తొలి వికెట్ కి 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ 246 పరుగుల లక్ష్యాన్ని చాలా సులభంగా ఛేదించింది.
పంజాబ్ కింత్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. పంజాబ్ తరపున ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ తొలి వికెట్ కి 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్ శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులు చేశాడు. నెహాల్ వధేరా 27 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. సన్ రైజర్స్ తరపు బ్యాటింగ్ లో అభిషేక్ చెలరేగితే.. బౌలింగ్ లో మాత్రం హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలోనే తన లక్ష్యాన్ని ఛేదించి.. చివరి స్థానంలో ఉన్న జట్టు 8వ స్థానానికి చేరుకుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">