Karun Nair: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… కసిగా ఆడుతున్న ప్లేయర్లు తెరపైకి వస్తున్నారు. గతంలో టీమిండియాలో చోటు కోల్పోయిన.. ఆటగాళ్లు సైతం… ఇప్పుడు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో దుమ్ము లేపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కరుణ్ నాయర్ ( Karun Nair ) కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి… భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) అధికారులకు మెసేజ్ పంపించాడు. మొన్నటి వరకు రంజీ అలాగే డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణించిన… కరుణ్ నాయర్ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు.
మెగా వేలం జరిగినప్పుడు పెద్దగా రాణించని కరుణ్ నాయర్ ను… కేవలం 50 లక్షల రూపాయలకు ఢిల్లీ క్యాపిటల్స్ చాలా తెలివిగా కొనుగోలు చేసింది. తక్కువ ధరకు కరుణ్ నాయర్ ను కొనుగోలు చేసినప్పటికీ… ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తాజాగా తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఏకంగా 89 పరుగులు చేశాడు.
కరుణ్ నాయర్ 7 సంవత్సరాల తర్వాత రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇవాళ రెండవ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో కరుణ్ నాయర్ ఏడు సంవత్సరాల తర్వాత ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో 11 పరుగులు చేసి ఉంటే సెంచరీ కూడా కంప్లీట్ చేసేవాడు కరుణ్ నాయర్. ఈ మ్యాచ్ లో 40 బంతులు వాడిన కరుణ్ నాయర్ 89 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సర్లతో పాటు 12 బౌండరీలు ఉన్నాయి. 222 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు. అయితే చివరికి సాంటన్నర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు కరుణ్ నాయర్. లేకపోతే సెంచరీ పూర్తి చేసుకునేవాడు.
Also Read: Preity Zinta on SRH : హైదరాబాద్ లో ప్రీతి జింటా పూజలు… దేవుడు మాత్రం SRH ను కనుకరించాడు
బుమ్రాకు వణుకు పుట్టించిన నాయర్
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ మెరుపు హాఫ్ సెంచరీ తో దుమ్ము లేపాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్… 89 పరుగులు చేశాడు. ముఖ్యంగా డేంజర్ ఆటగాడు బుమ్రా (Bumrah) వేసిన నాలుగో ఓవర్లో దుమ్ము లేపాడు కరుణ్ నాయర్. ఇందులో రెండు బౌండరీలు కొట్టాడు కరుణ్ నాయర్. ఆ తర్వాత ఆరో ఓవర్ లో కూడా దుమ్ము లేపాడు. దీంతో బుమ్రా వేసిన రెండు ఓవర్లలోనే 29 పరుగులు రాబట్ట గలిగాడు కరుణ్ నాయర్.