Anna Lezhneva: పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో ఇటీవలే జరిగిన ఒక అగ్ని ప్రమాదానికి గురి అయిన సంగతి తెలిసిందే. అయితే మార్క్ శంకర్ గురించి చాలామంది పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ తన కుమారుడిని ఎత్తుకొని హైదరాబాద్ వచ్చిన వీడియో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయం గురించి ట్విట్టర్ వేదికగా “మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున,తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం” ట్వీట్ చేశారు.
తిరుమలకు చేరుకున్న అన్నా లెజ్ నేవా
మార్క్ శంకర్ కోలుకోవడంతో అన్నా లెజ్ నేవా తిరుమలకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ భార్య అన్యమతస్తురాలు కావడంతో అక్కడ చేయవలసిన ఫార్మాలిటీస్ అన్నిటిని పద్ధతి ప్రకారం చేసి శ్రీవారి వద్ద తలనీలాలు అర్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సోషల్ మీడియా వేదికగా చాలామంది అన్నా లెజ్ నేవా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మామూలుగా ఆమె క్రైస్తవురాలు అయినా కూడా తిరుమలకు చేరుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అప్పట్లో ఆవిడతో పాటు సికింద్రాబాద్లోని ఒక చర్చికి వెళ్లిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. తన భార్య నమ్మకం ప్రకారం పవన్ కళ్యాణ్ చర్చికి వస్తే, తన భర్త నమ్మకం ప్రకారం అన్నా లెజ్ నేవా తిరుమలకు చేరుకున్నారు. ఆవిడ ఈరోజు రాత్రి అక్కడే నివాసం ఉండి రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు.
పవన్ కళ్యాణ్ భక్తి
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హిందూ మతానికి ఎంతలా గౌరవాన్ని తీసుకొస్తున్నాడు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిసారి సనాతన ధర్మం అంటూ ప్రస్తావని తీసుకొస్తారు. అయితే ఇది చాలామందికి నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మత విద్వేషాలు రేపుతున్నాడు అంటూ కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పూజలు చేయడం వలనే తన కుమారుడు కోల్కొన్నాడు అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా చర్చలు పెట్టారు.
Also Read : Kubera Update: ఫస్ట్ సింగిల్ త్వరలో.. అప్డేట్ తో హైప్ పెంచేసిన మేకర్స్..!