BigTV English

Lakshya Sen creates history: బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ హిస్టరీ క్రియేట్, మరో పతకం ఖాయం..

Lakshya Sen creates history: బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ హిస్టరీ క్రియేట్, మరో పతకం ఖాయం..

Lakshya Sen creates history: పారిస్ ఒలింపిక్స్‌లో గెలుస్తామని భావించిన ఆటగాళ్లంతా ఇంటిదారి పట్టారు. బ్యాడ్మింటన్‌లో భారత్ పనైపోయిందని అభిమానులు భావించారు. టోర్నీ ముందు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగారు భారత్ స్టార్ షట్లర్ లక్ష్యసేన్. అన్ సీడ్ ఆటగాడిగా బరిలోకి దిగిన సేన్, బలమైన ప్రత్యర్థులను మట్టి కరిపించాడు. బ్యాడ్మింటన్‌లో పతకంపై ఆశలు పెంచాడు. 22 ఏళ్ల లక్ష్యసేన్ సెమీస్‌లోకి అడుగుపెట్టి హిస్టరీ క్రియేట్ చేశారు.


బ్యాడ్మింటన్‌లో భారత్ స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. తన ఎత్తులతో బలమైన ప్రత్యర్థులను సైతం మట్టి కరిపించి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. అంతేకాదు ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌ లో సెమీస్ చేరిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం రాత్రి తైపీకి చెందిన 12వ సీడ్ ఆటగాడు టియాన్ చెన్‌పై సంచలన విజయం సాధించాడు. దాదాపు 75 నిమిషాల సేపు జరిగిన పోరులో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు సేన్.

పురుషుల సింగిల్స్ విభాగంలో తైపీకి చెందిన 12వ సీడ్ ఆటగాడు టియాన్ చెన్‌పై 19-21, 21-15, 21-12 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టారు లక్ష్యసేన్. తొలి సెట్‌లో ఇరువురు ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. కేవలం రెండు పాయింట్ల తేడాతో సేన్ ఓటమి పాలయ్యాడు. సెకండ్ సెట్‌లో మాత్రం ప్రత్యర్థి బలాబలాలను గమనించిన సేన్, తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.


ALSO READ: ఉత్కంఠగా సాగిన తొలి వన్డే.. భారత్‌- శ్రీలంక మ్యాచ్‌ టై

చెన్‌కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు.. ఫలితంగా 21-15 తేడాతో గెలిచింది. దీంతో మూడో సెట్ ఇరువురు ఆటగాళ్లకు ప్రతి ష్టాత్మకంగా మారింది. సేన్ దూకుడు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. భారీగా ర్యాలీలు ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా మ్యాచ్‌ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. చివరి వరకు అదే దూకుడు కొనసాగించాడు. ప్రత్యర్థికి కేవలం 12 పాయింట్లు మాత్రమే విజయం సాధించాడు. సెమీస్‌లో డెన్మార్క్‌కి చెందిన అక్సెల్సెస్‌తో తలపడనున్నాడు.

భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ వరకు మాత్రమే చేరారు. దీంతో సెమీస్‌కు చేరిన ఆటగాడిగా లక్ష్యసేన్ రికార్డుల కెక్కాడు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ఓటమిపాలైన విషయం తెల్సిందే.

 

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×