BigTV English

16 Years of Virat Kohli with IPL: ఒకే ఒక్కడు.. ఒకే జట్టులో 16 ఏళ్లు ఆర్సీబీలో కొహ్లీ ప్రయాణం

16 Years of Virat Kohli with IPL: ఒకే ఒక్కడు.. ఒకే జట్టులో 16 ఏళ్లు ఆర్సీబీలో కొహ్లీ ప్రయాణం

virat kohli ipl news


Celebrating 16 Years of Virat Kohli in IPL: మరో కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పుడందరి కథలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో మొదటగా చెప్పేది విరాట్ కొహ్లీ ఐపీఎల్ కథ.. ఒకే ఒక ఫ్రాంచైజీ తరఫున 16 ఏళ్లుగా ఆడుతున్న ఏకైక క్రికెటర్ కొహ్లీ మాత్రమే.. ఇదే మాట ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఒక సాధారణ క్రికెటర్ గా అడుగు పెట్టాడు. అప్పటికి తను అండర్ 19 లో ఆడి, సెకండ్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అటు తర్వాత వెస్టిండీస్ పర్యటనలో సెంచరీ చేశాడు. ఎందుకంటే అక్కడ బౌన్సీ పిచ్ లపై, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని సెంచరీ చేయడమంటే మాటలు కాదు. దీంతో అందరి దృష్టిలో పడిన కొహ్లీలోని ఆటగాడిని ఆర్సీబీ కూడా గుర్తించింది. అలా ఏడాదికి రూ.12 లక్షలకు కొనుగోలు చేసింది.

తొలి సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడి 165 పరుగులు మాత్రమే చేసిన కొహ్లీ.. ఇప్పుడు ఐపీఎల్ లీగ్ లోనే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇప్పటివరకు 235 మ్యాచ్ లు ఆడి 7,263 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 50 ఆఫ్ సెంచరీలున్నాయి.


Also Read: మేం వచ్చాం.. మరి మీరొస్తారా? భారత్ రాక కోసం ఎదురుచూస్తున్న పాక్

2013 సీజన్ కి కెప్టెన్ బాధ్యతలు అందుకున్నాడు. 2016లో ఫైనల్ వరకు తీసుకెళ్లి విజేతగా నిలపలేకపోయాడు. అప్పటికే టీమ్ ఇండియా సారధ్య బాద్యతల నుంచి తప్పుకున్న కొహ్లీ, నెమ్మదిగా 2021లో ఆర్సీబీ పగ్గాలు కూడా వదిలిపెట్టి, మొత్తం ఆటపైనే ఫోకస్ పెట్టాడు.

కెప్టెన్ గా ఉన్న కాలంలో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడిన కొహ్లీ తర్వాత నెమ్మదిగా గాడిలో పడ్డాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. అలాంటి కొహ్లీ ఇప్పుడు ఐపీఎల్ కోసం రెడీ అవుతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది.అయితే ఐపీఎల్ లో అయినా ఆడతాడా? లేక డైరక్టుగా టీ 20 ప్రపంచ కప్ కి వస్తాడా? అన్నది ఇంకా క్లారిటీ లేదు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×