Big Stories

TSRTC Launched Electric Buses: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 22 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన తెలంగాణ మంత్రులు

- Advertisement -

Electric Buses Launched by Telangana Ministers: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో గుడ్‌ న్యూస్‌తో ముందుకొచ్చింది. ఉచిత బస్సు వల్ల రద్దీ ఎక్కువగా పెరిగిపోవడంతో.. అందుకు అనుగుణంగా కొత్త బస్సుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం 22 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జెండా ఊపి ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించారు.

- Advertisement -

ఆగస్టు నాటికి.. అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న 500 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ నాన్ ఏసీ బస్సులే. పాత మెట్రో ఎక్స్ ప్రెస్ ల స్థానంలో ఈ బస్సుల్ని తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహిళలు ఈ బస్సుల్లో కూడా ఆధార్ కార్డును చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకూ కొత్తగా వచ్చే బస్సులు నడవనున్నాయి. బీహెచ్ఈఎల్, మియాపూర్, కంటెన్మెంట్, హెచ్ సీయూ, రాణిగంజ్ డిపోలలో 33 కేవీ పవర్ లైన్లు తీసుకున్నారు.

మరోవైపు టీఎస్ ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్ బస్సుల్ని సమకూర్చుకుంటుంది. వీటిలో 125 మెట్రో డీలక్స్ లు ఉంటాయి. ఇవన్నీ జూన్ నెలలో అందుబాటులోకి వస్తాయి. 440 బస్సుల్లో 300 మెట్రె ఎక్స్ ప్రెస్ లు ఉండగా.. 140 ఆర్డినరీ బస్సులున్నాయి. హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. మహాలక్ష్మి స్కీమ్ కింద నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు.

Also Read: ఫ్యామిలీ అంతా ప్రభుత్వ ఉద్యోగులే.. ఈజీ మనీకోసం రూ.15 కోట్లు అప్పు చేసి మరీ..

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి పన్నం ప్రభాకర్ ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు ఒక కార్మికుడిలా కృషి చేస్తున్నారని కొనియాడారు. టీఎస్ ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా కల్పిస్తున్న బస్సు ప్రయాణ ఖర్చును.. ప్రభుత్వం ఆర్టీసీ ఇస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయనిది.. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను మూడు నెలల్లో అమలు చేశామని భట్టి విక్రమార్క తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News