BigTV English

Ashwani Kumar: ఆటో ఛార్జీకి రూ.30 అడిగేవాడు.. కానీ ఇప్పుడు ముంబైని ఏలుతున్నాడు !

Ashwani Kumar: ఆటో ఛార్జీకి రూ.30 అడిగేవాడు.. కానీ ఇప్పుడు ముంబైని ఏలుతున్నాడు !

Ashwani Kumar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా సోమవారం రోజు వాంఖడే స్టేడియంలో కలకత్తా నైట్ రైడర్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. సొంత గడ్డపై కలకత్తా నైట్ రైడర్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముంబై బౌలర్ల దాటికి మొదట బ్యాటింగ్ చేసిన కలకత్తా 116 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 12.5 ఓవర్లలోనే చేదించింది.


 

అయితే ఈ మ్యాచ్ తో ముంబై ఇండియన్స్ మరో యువ సంచలనాన్ని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. అతడే అశ్వినీ కుమార్. అరంగేట్ర బౌలర్ అశ్వినీ కుమార్ ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్ లోనే 4 వికెట్లు పడగొట్టి “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” గా నిలిచాడు. అంతేకాకుండా ఐపిఎల్ లో తొలి మ్యాచ్ లోనే 4 వికెట్లు సాధించిన మొదటి భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. తన పేస్ బౌలింగ్ తో కలకత్తా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.


అజింక్య రహనే, రింకూ సింగ్, రస్సెల్ వంటి స్టార్ బ్యాటర్లను ఈ యువ పేసర్ బోల్తా కొట్టించాడు. తన తొలి బంతికే కలకత్తా కెప్టెన్ అజింక్య రహానేను అవుట్ చేసి.. తన డెబ్యూని ఘనంగా చాటుకున్నాడు. ఈ మ్యాచ్ లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విని కుమార్.. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో అద్భుతంగా రాణిస్తుంటాడు.

ఇతడు 2024 సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నాడు. కానీ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోలేదు. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్విని కుమార్ ని 30 లక్షలకు దక్కించుకుంది ముంబై ఇండియన్స్. ఇతడు 2022లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరఫున అరగటం చేశాడు. అందులో కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడి 8.50 ఎకానమీతో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా పంజాబ్ తరఫున రెండు ఫస్ట్ క్లాస్, నాలుగు లీస్ట్ – ఏ మ్యాచ్ లు కూడా ఆడాడు.

అయితే ఈ ఐపీఎల్ లో అశ్విని సంచలన ప్రదర్శన పట్ల అతడి తండ్రి హర్కేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే క్రికెట్ పై తన కొడుకుకు ఉన్న ఇష్టాన్ని వివరించాడు. కుమారుడు అశ్విని కుమార్ గురించి తండ్రి హర్కేష్ కుమార్ మాట్లాడుతూ.. ” వర్షం వచ్చినా, ఎండ కొట్టినా అశ్విని మాత్రం ప్రాక్టీస్ కి వెళ్లడానికి ఎప్పుడు వెనకాడలేదు. ట్రైనింగ్ నుండి రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చేవాడు. మళ్లీ ఉదయం ఐదు గంటలకే ప్రాక్టీస్ కి వెళ్ళిపోయేవాడు.

కొన్నిసార్లు పిసిఏ అకాడమీకి సైకిల్ పై వెళ్లేవాడు. మరికొన్నిసార్లు లిఫ్ట్ పై వెళ్లేవాడు. కొన్ని సందర్భాలలో షేర్ ఆటో కి కూడా వెళ్లేవాడు. ఆటో ఛార్జీలకు ₹30 రూపాయలు అడిగేవాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ అతడిని 30 లక్షలకు దక్కించుకుంది. తాను తీసుకున్న ప్రతి పైసాకు న్యాయం చేశాడు” అని చెప్పుకొచ్చాడు. అలాగే అతడి సోదరుడు శివ్ రాణా మాట్లాడుతూ.. ” బూమ్రా, మిచెల్ స్టార్క్ లాగా ఎదగాలని అశ్విని కలలు కనేవాడు.

 

అతడి స్నేహితులు క్రికెట్ బంతుల కోసం డబ్బులు పోగు చేసేవారు. వేలం తర్వాత అశ్విని మా ఊరు పక్కన ఉన్న అకాడమీలో క్రికెట్ కిట్లు, బంతులు పంపిణీ చేశాడు. తన పేరున్న జెర్సీని ధరించడానికి అతడు ఎప్పుడూ కలలు కనేవాడు. ఇప్పుడు తన ప్రదర్శనతో పిల్లలు అతడి జెర్సీని వేసుకునేలా చేసుకున్నాడు” అని అతడి సోదరుడు తెలిపాడు.

Related News

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Big Stories

×