BigTV English

Sanjiv Goenka on KL Rahul: కేఎల్ రాహుల్ స్వార్థ పరుడు, నమ్మక ద్రోహి !

Sanjiv Goenka on KL Rahul: కేఎల్ రాహుల్ స్వార్థ పరుడు, నమ్మక ద్రోహి !

Sanjiv Goenka on KL Rahul: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, లక్నో సూపర్ జేయింట్స్ ( Lucknow Super Giants ) గత కెప్టెన్ కేఎల్ రాహుల్ ను ( KL Rahul ) ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు లక్నో సూపర్ జేయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka ). కేఎల్ రాహుల్ స్వార్థ పరుడని.. ద్రోహి అంటూ ఫైర్‌ అయ్యారు. అయితే.. కేఎల్ రాహుల్ పేరును ప్రస్తావించకుండా.. ఈ వ్యాఖ్యలు చేశారు లక్నో సూపర్ జేయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా.


Lucknow Super Giants Owner Sanjiv Goenka Sensational Comments on KL Rahul

ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్ అసలు మర్చిపోలేని ఓ సంఘటన చోటు చేసుకుంది. లక్నో సూపర్ జేయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ను ( KL Rahul ) ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకా ఒకానొక సంఘటనలో క్లాస్ ఇస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఆ సమయంలోనే కేఎల్ రాహుల్ లక్నోను వదిలివేయాలని నిర్ణయం తీసుకున్నాడని అనేక రకాలుగా వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka )…. రాహుల్ ను మళ్లీ కలవడం, అతడిని కౌగిలించుకున్నటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

Also Read: India vs New Zealand: ఇవాళ్టి నుంచే 3వ టెస్ట్‌.. భారీ స్కెచ్‌ వేసిన టీమిండియా!


అయితే ఐపీఎల్ వేలానికి ముందుగానే కేఎల్ రాహుల్ ( KL Rahul ) బయటికి వెళ్ళిపోతున్నట్టు చెప్పినట్లుగా జోరుగా ప్రచారాలు జరిగాయి. తాజాగా లక్నో సూపర్ జేయింట్స్ ప్రకటించిన రిటెన్షన్ జాబితాల లిస్ట్ లో కేఎల్ రాహుల్ పేరు లేదు. రాహుల్ కి బ్యాకప్ కెప్టెన్ గా పనిచేస్తున్న నికోలస్ పూరన్ ని 21 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఇచ్చి లక్నో సూపర్ జేయింట్స్ రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత స్పిన్నర్ రవి బిష్నోయ్, మయాంక్ యాదవ్ లను 11 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. ఇక అన్ క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని లను 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.

Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

మరి బయటకు వచ్చిన కేఎల్ రాహుల్ ను ఆక్షన్ లో ఏ టీమ్ కొనుగోలు చేయనుందో చూడాలి. ఇక లక్నో జట్టును వీడిన కేఎల్ రాహుల్ పై టీం ఓనర్ సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka )సోషల్ మీడియా వేదికగా కొన్ని సంచలన వాక్యాలను షేర్ చేసుకున్నాడు. అందులో భాగంగా కేఎల్ రాహుల్ ను ఉద్దేశించి అతడు చాలా స్వార్థపరుడని, కేవలం వ్యక్తిగత లక్ష్యాల కోసమే కేఎల్ రాహుల్ ఆడుతాడు అంటూ విమర్శలు చేశాడు. అతనిలా వ్యక్తిగత లక్ష్యాల కంటే జట్టు విజయం కోసం మాత్రమే ఆడే ఆటగాళ్లను మేము రిటైన్ చేసుకున్నామని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో దుమారం రేపుతున్నాయి.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×