LSG vs DC IPL 2024 Match Prediction: ఐపీఎల్ 2024 సీజన్ అద్భుతంగా నడుస్తోంది. వెనుకపడిన ముంబై ఇండియన్స్ ముందడుగు వేసింది. ఆర్సీబీని చూస్తే ఇంకా వెనక్కి పోయింది. నేడు లక్నో సూపర్ జెయంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లక్నోలో రాత్రి 7.30కి ప్రారంభం కానుంది.
ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరిగాయి. ఈ మూడింట్లో కూడా లక్నో గెలవడం విశేషం. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని నమోదు చేయలేదు.
ఇప్పటివరకు 2024 సీజన్ లో జరిగిన మ్యాచ్ లను చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పాయింట్ల టేబుల్ పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. 5 మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి, 4 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. అందువల్ల నేడు జరగబోయే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కి అత్యంత కీలకంగా మారనుంది.
ఎందుకంటే ఇప్పటికే ఐదు మ్యాచ్ లు అయిపోయాయి. ఆరో మ్యాచ్ ఇది.. ఇది కూడా ఓడిపోతే.. మిగిలినవాళ్లతో రేసులో ముందుకి వెళ్లే పరిస్థితి లేదు. అందుకని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కి ఇది జీవన్మరణ మ్యాచ్ గా మారనుంది.
Also Read: ఆర్సీబీని చితక్కొట్టిన ముంబై.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
ఇక లక్నో విషయానికి వస్తే ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు గెలిచి, ఒక పరాజయంతో 6 పాయింట్లతో టేబుల్ పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇంక ఇక్కడ నుంచి కిందపడకుండా చూసుకోవాలి. కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వంలో జట్టు సమష్టిగా ముందుకెళుతోంది. అయితే కెప్టెన్ ఇన్నింగ్స్ ఇంకా తన నుంచి రాలేదు. అదేమైనా వస్తే, ఈ మ్యాచ్ కళ్లు మూసుకుని విజయం సాధించడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ (వీరు ఆడవచ్చు):
క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్
ఢిల్లీ క్యాపిటల్స్ (వీరు ఆడవచ్చు):
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషబ్ పంత్ , ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, ఝే రిచర్డ్‌సన్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్