BigTV English

Cyber Crime: సైబర్ క్రైమ్ లో రష్యా టాప్.. భారత్‌ది 10వ స్థానం

Cyber Crime: సైబర్ క్రైమ్ లో రష్యా టాప్.. భారత్‌ది 10వ స్థానం

India Ranks Number 10 In Cybercrime: పెరుగుతున్న సైబర్ క్రైమ్, సైబర్ నేరాలు మోసాలపై సర్వే ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ క్రైమ్ నిపుణులు ఓ సర్వే నిర్వహించగా.. సైబర్ నేరాల విషయంలో రష్యా అగ్రస్థానంలో ఉండగా.. భారతదేశం సైబర్ నేరాలలో 10వ స్థానంలో ఉంది. ఇక్కడ ముందుగునే రుసుములు చెల్లింపులు జరిపించడం చేసే మోసాలు ఎక్కువగా జరగుతున్నాయని తాజా అధ్యనంలో వెల్లడైంది.


అంతర్జాతీయ పరిశోధకుల బృందం ‘వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్’ని విడుదల చేసింది. ఇది దాదాపు 100 దేశాలపై పరిశీలన చేస్తుంది. క్రెడిట్ కార్డ్ దొంగతనం, స్కామ్‌లతో సహా అనేక రకాల సైబర్ నేరాల ప్రకారం కీలక హాట్‌స్పాట్‌లను గుర్తిస్తుంది. ఇందులో వివిధ విభాగాల్లో సైబర్ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించింది. ఈ సర్వే ద్వారా పరిశోధకులు, వర్చువల్ ప్రపంచంలోని ప్రధాన నేరాలను పరిగణలోకి తీసుకోవాలని సైబర్ నేరాలు ఎక్కువగా ఏ దేశాల్లో జరుగుతున్నాయో ఆ దేశాల పేర్లను ఇవ్వాలని ప్రపంచ పరిశోధకులు నిపుణులకు సూచించారు.

పరిశోధకులు గుర్తించిన కీలక వర్గాలు – మాల్వేర్ వంటి సాంకేతక ఉత్పత్తులు, సైబర్ దాడులు, రాన్సమ్ వేర్ దోపిడీ, హ్యాకింగ్, డేటా , జాయింట్ ఖాతాలు, క్రెడిట్ కార్డ్‌లతో సహా గుర్తింపు దొంగతనం వంటి సాంకేతిక ఉత్పత్తులు , సేవలు, ముందస్తు రుసుము మోసం వంటి మోసాలు, చట్టవిరుద్ధమైన వర్చువల్ కరెన్సీ కూడిన మనీలాండరింగ్ ఉన్నాయి.


Also Read: ఫలితాలు తారుమారు, విపక్షం వైపే ఓటర్లు, ప్రపంచవ్యాప్తంగా..

తాజా పరిశోధనలో గుర్తించిన అంశాలు ఇవే.. టాప్ 10 దేశాల్లో.. రష్యా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా ఉన్నాయి. పరిశోధన ప్రకారం, ఉత్తర కొరియా ఏడవ స్థానంలో ఉండగా, UK , బ్రెజిల్ వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి.

ఒక్కో సైబర్ క్రైమ్ కేటగిరీ కింద టాప్ టెన్ దేశాల్లో మొదటి ఆరు దేశాలు ఒక మోస్తారు స్థాయి సైబర్ క్రైమ్ రకాల్లో ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మిగతా దేశాలు మాత్రం అటు హైటెక్, ఇటు లోటెక్ నేరాల్లోను దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.

ఇదిలా ఉంటే భారత్ లో కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మన దేశం సమతుల్య హబ్ గా ఉంది. ఇక్కడ ఓ మోస్తారు స్థాయి సాంకేతిక నేరాలు చోటు చేసుకున్నాయి. రొమేనియా ,యూకే లో మాత్రం హైటెక్, లోటెక్ నేరాలు జరుగుతున్నాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×