BigTV English

PV Sindhu Vs Wang Zhi: పీవీ సింధు ఫైనల్లో చైనాతో అమితుమీ!

PV Sindhu Vs Wang Zhi:  పీవీ సింధు ఫైనల్లో చైనాతో అమితుమీ!

Malaysia Master Final Fight – PV Sindhu Vs Wang Zhi: ఎట్టకేలకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్‌లోకి వచ్చేసింది. మరో 60 రోజుల్లో పారిస్ ఒలింపిక్స్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సింధు ఫామ్‌లోకి రావడంతో తమకు పతకం ఖాయమనే అంచనాలు వేసుకుంటుకున్నారు స్పోర్ట్స్ లవర్స్.


తాజాగా కౌలాలంపూర్ వేదికగా మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నోలో ఫైనల్‌కు చేరింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. ఫైనల్‌లో చైనాకు చెందిన సెంకడ్ సీడ్ వాంగ్ జి యితో అమితుమీకి సిద్ధమైంది.

అంతకుముందు శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ధాయ్‌లాండ్ ప్లేయర్‌ బుసానన్‌పై అతికష్టం మీద నెగ్గింది. ఇరువురు ఆటగాళ్ల మధ్య పోరు దాదాపు గంటన్నర సేపు సాగింది. తొలి గేమ్‌లో ఓడిపోయిన సింధు, ప్రత్యర్థి బలబలాలను అంచనా వేసింది. రెండో మ్యాచ్‌లో తన అనుభవాన్ని రంగరించి పైచేయి సాధించిందామె.


దీంతో మూడో మ్యాచ్ ఇద్దరి మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. ఆది నుంచి దూకుడు మొదలుపెట్టిన సింధు, ప్రత్యర్థికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఆమె కోలుకునేలోపు మ్యాచ్‌ని ముగించింది. 13-21, 21-16, 21-12 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Also Read: యూఎస్‌కు బయలుదేరిన టీమిండియా ఆటగాళ్లు, కాకపోతే..

బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన షట్లర్‌గా పీవీ సింధు రికార్టుల కెక్కింది. గతంలో సైనానెహ్వాల్ 451 మ్యాచ్‌లు ఆటగా, ఇప్పుడు సింధు 453 మ్యాచ్‌లు కావడం విశేషం.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×