E-Paper
Advertisement

Team India Players Depart for US: అమెరికాకు బయలుదేరిన టీమిండియా ఆటగాళ్లు, కాకపోతే..!

Team India Players Depart for US: అమెరికాకు బయలుదేరిన టీమిండియా ఆటగాళ్లు, కాకపోతే..!
Advertisement

Team India Players Depart to US: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఆటగాళ్లు యూఎస్‌కు వెళ్లారు. మధ్యాహ్నానికి అమెరికాకు  చేరుకునే అవకాశం వుంది. రాత్రి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరింది టీమిండియా.

టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఆటగాళ్లు యూఎస్ వెళ్లారు. మధ్యాహ్నానికి అమెరికాకు అక్కడికి చేరుకునే అవకాశం వుంది. భారత టీమ్ ఒక బ్యాచ్ రాత్రి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరింది. ఇప్పుడు కొందరు ఆటగాళ్లు మాత్రమే వెళ్లారు. మరొకరు రేపు లేదా ఎల్లుండి బయలుదేరే ఛాన్స్ ఉంది. ఆటగాళ్లతో కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా వెంట ఉన్నారు.

Advertisement

బయలుదేరిన వారిలో కెప్టెన్ రోహిత్ శర్మ, బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివమ్ దూబె వంటి ఆటగాళ్లు విమానం ఎక్కారు. అంతకుముందు ఎయిర్‌పోర్టులో ఆటగాళ్లు గ్రూప్ ఫోటో దిగారు. దాన్ని బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం లండన్ ఉన్న హార్థిక్‌పటేల్ అక్కడి నుంచి అమెరికాకు వెళ్లనున్నారు. ఇదిలావుండగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితోపాటు ఐపీఎల్ క్వాలిఫ్లయర్-2లో ఆడిన రాజస్థాన్ ఆటగాడు సంజూశాంసన్, జైశ్వాల్, రింకూసింగ్ వెళ్లనున్నారు.

Advertisement

Also Read: నేడే ఐపీఎల్ ఫైనల్.. కోల్‌కతా vs హైదరాబాద్.. ట్రోఫీ వరించేదెవరినో..?

జూన్ రెండున ప్రారంభమయ్యే టీ 20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో తలపడనుంది. అంతకుముందు అంటే ఒకటిన ప్రాక్టీసు మ్యాచ్‌లో ఆడనుంది. ఈ టోర్నీ అమెరికాతోపాటు వెస్టిండీస్ వేదికగా జరగనుంది. అమెరికా కంటే వెస్టిండీస్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Tags

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×