BigTV English

Nita Ambani: నీతా అంబానీపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ దాడి…వీడియో వైరల్

Nita Ambani: నీతా అంబానీపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ దాడి…వీడియో వైరల్

Nita Ambani:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రోహిత్ శర్మ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. రోహిత్ శర్మ ను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియామకం చేయాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యాను వెంటనే తొలగించాలని… లేకపోతే ముంబై ఇండియన్స్ ఓటమి పాలు కావడం గ్యారెంటీ అంటున్నారు. అయితే తాజాగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ నిరసన సెగ ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానికి కూడా తగిలింది. ఆమె షిరిడీకి వెళ్తే అక్కడ కూడా… రోహిత్ శర్మ అభిమానులు తమ డిమాండ్ను వినిపించారు.


షిర్డీ సాయిబాబా సన్నిధిలో నీతా అంబానీ

తాజాగా.. ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ… తన పర్సనల్ సిబ్బందితో కలిసి షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా… ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక ఆహ్వానాన్ని అందించారు. అయితే షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న తర్వాత… తెలుగు ప్రయాణం అయ్యారు నీతా అంబానీ. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న కొంతమంది రోహిత్ శర్మ అభిమానులు… అతన్ని కెప్టెన్ చేయాలని నినాదాలు చేశారు. ఇక ఒక అభిమాని అయితే నేరుగా నీతా అంబానీ దగ్గరికి వెళ్లి… మేడం రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వండి అని హిందీలో డిమాండ్ చేశాడు. దీంతో ఆమె దండం పెట్టి… అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


2024లో ముంబై కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా

2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సమయంలో… రోహిత్ శర్మను పక్కకు పెట్టి గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై జట్టులోకి తీసుకువచ్చారు నీతా అంబానీ. అక్కడితో ఆగకుండా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కూడా హార్దిక్ పాండ్యాను నియామకం చేశారు. దీంతో హార్దిక్ పాండ్యాను దారుణంగా ట్రోలింగ్ చేశారు అభిమానులు. అయినప్పటికీ హార్థిక్ పాండ్యా అనే కొనసాగించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. ముంబై ఇండియన్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా నియామకం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ జట్టు పెద్దగా పెర్ఫార్మన్స్ చేయలేదు. అత్యంత దారుణంగా విఫలమౌతూ వస్తోంది. ఈసారి కూడా హార్దిక్ పాండ్యా నే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.

దారుణంగా విఫలమవుతున్న రోహిత్ శర్మ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత దారుణంగా విఫలమవుతున్నాడు. ఒక మ్యాచ్ అంటే ఒక మ్యాచ్ లో కూడా పెద్దగా రాణించలేదు రోహిత్ శర్మ. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా దారుణంగా విఫలమయ్యాడు రోహిత్ శర్మ. నిన్నటి మ్యాచ్లో 12 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. 12 పరుగుల తేడాతో చివరలో విజయం సాధించింది ముంబై ఇండియన్స్.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×