Intinti Ramayanam Today Episode April 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి వెంటనే అవని పిలిచిన దగ్గరికి వెళుతుంది. ఏమైందని అడగ్గని నువ్వు సీతారాముల వారి కళ్యాణం జరిపించడానికి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించాలి. మేమిద్దరం పీటల మీద కూర్చునేలా చేసి ఈ కళ్యాణం జరిగేలా చేయాలి లేదంటే మాత్రం నువ్వు వెళ్తావని వార్నింగ్ ఇస్తుంది. తాటాకు చప్పులకు పల్లవి భయపడదు అని వెళ్ళిపోతుంది. అవని పల్లవిని చిటికేసి ఆపుతుంది. నువ్వు ఆరోజు దాచిన రహస్యం ఇప్పుడు అందరికీ చూపిస్తే ఏమవుతుందో తెలుసా? ఇంట్లో వాళ్ళందరూ నేను చీకొట్టడమే కాదు చంపి పాత్ర వేస్తారు అని అంటుంది. నా ఫోన్లో ఈ వీడియో ఉన్నంతవరకు నువ్వు నన్ను ఏమి చేయలేవు నేను చెప్పినట్లు ఆడాల్సిందే నేను చెప్పినట్టు చేయాల్సిందే అని ఓ ఆట ఆడుకుంటుంది. పల్లవి మొదట టెన్షన్ పడుతుంది తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తానక్కా ఆ వీడియోని మాత్రం ఎవరికీ చూపించదు అని భయపడుతుంది. ఇంటికి వెళ్ళగానే అందర్నీ కేకలు వేసి పిలుస్తుంది. ఏమైంది ఎందుకు ఇలా అరుస్తున్నావు అంటే సీతారాముల వారి కల్యాణం జరిపిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను మామయ్య జరిపిద్దామని అందర్నీ అడుగుతుంది. ముందు మాత్రం వద్దని వాదిస్తారు. మొత్తానికి పల్లవి మాటకు అందరు సరే అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. పల్లవి అందరిని ఒప్పించిన విషయం ఆరాధ్య అవనితో అంటుంది. నువ్వు మాట ఇచ్చినట్లే చేస్తున్నావ్ అమ్మ కచ్చితంగా నువ్వు కళ్యాణానికి రావాలి అని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే పల్లవి రావడం చూసి పల్లవి పిన్ని వస్తుందమ్మా నేను తర్వాత మాట్లాడుతానని ఆరాధ్య అంటుంది. కానీ పల్లవి కి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను నువ్వు ఎవరితో నువ్వు భయపడకుండా నాతో మాట్లాడొచ్చు అని అంటుంది. పల్లవికి ఫోన్ ఇస్తే నేను చెప్పింది గుర్తుందిగా అందరూ కళ్యాణం కు వస్తున్నారా అనేసి అడుగుతుంది నువ్వు చెప్పినట్లే అందరూ కళ్యాణానికి వస్తున్నారు అక్క. నువ్వు ఎలా చెప్తే అలానే అనేసి పల్లవి అంటుంది. సరే అమ్మ నువ్వు నాతో మాట్లాడటం ఎవరైనా చూస్తే బాగోదు అనగానే నేను ఫోన్ నెంబరు డిలీట్ చేస్తానమ్మా అని ఆరాధ్య అంటుంది. తల్లి కూతురు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా మీ నాటకాన్ని బయటపెడతానని పల్లవి అంటుంది.
ఉదయం లేవగానే పల్లవి గుడికి వెళ్లడానికి రెడీ అవుతుంది.. స్వరాజ్యం, ఇద్దరు వేరే గుడ్లు కళ్యాణమయి రమ్మని అడుగుతారు. నేను గుడికి వెళుతున్నాను పిన్ని మా ఆయనతో కలిసి కళ్యాణ జరిపించడానికి అనగానే వాళ్ళందరూ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అని అడుగుతారు. ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను వెళ్లి తీరాలి పిన్ని మా ఇంట్లో కలిసి కచ్చితంగా ఈ కళ్యాణాన్ని జరిపించాలి అని అవని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఎవరు రెడీ కాలేదని పల్లవి అనుకుంటుంది. ఒక్కొక్కరుగా బయటికి వస్తారు. కమ్మలు మామూలుగా ఉన్నట్లే భానుమతితో సరదాగా మాట్లాడుతాడు. ఇంట్లో అందరూ రెడీ అయ్యి వస్తారు అందులో ఆడవాళ్లు రెడీ అయ్యారు ఏంటి మగవాళ్ళు ఇంకా రాలేదు ఏంటి అని శ్రియ అడుగుతుంది. అప్పుడు అందరూ పైనుంచి కిందకి వస్తారు. కానీ పార్వతి మాత్రం గుడికి రానని చెప్తుంది మొత్తానికైతే పల్లవి పార్వతీ ఒప్పించేసి గుడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అవని ఫోన్ చేయగానే అందరిని తప్పకుండా తీసుకొస్తాను అక్కని పల్లవి భయపడుతూ ఉంటుంది..
అందరు కలిసి సంతోషంగా గుడికి వెళ్తారు. అక్కడ కళ్యాణం జరిపించాలని అనుకుంటారు. అక్కడ గుడికి వెళ్లిన వాళ్లంతా కళ్యాణం జరిపించాలని అనుకుంటారు. అయితే పూజారితో పూజ గురించి చెప్తారు. కళ్యాణం కోసం పెద్ద కోడలు లేదని చెప్పాము కదా అంటుంది. మీ పెద్ద కోడలు ఇక్కడే ఉందమ్మా అంటాడు. అప్పుడే అవని అక్కడకు వస్తుంది. నేను ముందుగా చెప్పినట్లు ఈ పూజకు రాను నేను వెళ్లిపోతున్నా అని అంటుంది. ఇదంతా నీ ప్లాన నీ ప్లాన్ ప్రకారం అందరిని తీసుకొచ్చావా కచ్చితంగా నేను ఇక్కడ ఉన్న నువ్వు వెళ్ళిపోతానని పార్వతి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో అందరూ కలిసి కల్యాణం జరిపిస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.. ఏది ఏమైనా రేపటి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తుంది.