BigTV English

Manu Bhaker| లక్షల నుంచి కోట్లలోకి మను భాకెర్ ఫీజు.. క్యూ కడుతున్న కంపెనీలు!

Manu Bhaker| లక్షల నుంచి కోట్లలోకి మను భాకెర్ ఫీజు.. క్యూ కడుతున్న కంపెనీలు!

Manu Bhaker| పారిస్ ఒలింపిక్స్ లో భారత్ చాటుతున్న మనూ భాకెర్ పాపులారిటీ పీక్స్ లో ఉంది. ఇండియా షూటింగ్ చాంపియన్ గా పేరొందిన మనూ ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించగా మరో పతకం వేటలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఇండియన్ మీడియాలో మార్మోగిపోతోంది. ఫలితంగా ఆమెను తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, తమ ప్రాడక్ట్స్ కోసం యాడ్స్ చేయమని చాలా కంపెనీ ప్రతినిధులు క్యూ కడుతున్నారు. దీంతో మనూ భాకెర్ తన రెమ్యూనరేషన్ ఫీజు ఒక్కసారిగా ఆరింతలు, ఏడింతలు పెంచేసింది.


ఒలింపిక్స్ ముందువరకు ఆమె ఒక కంపెనీ యాడ్ చేయాలంటే.. 20 నుంచి 25 లక్షలు అడిగేది. అయితే ప్రస్తుతం ఆమె కోటి 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఇటీవల ఆమె ఒక యాడ్ కోసం కోటిన్నర డిమాండ్ చేసింది. కేవలం గత రెండు మూడు రోజుల్లోనే దాదాపు 40 కంపెనీలు ఆమె కోసం ప్రయత్నిస్తున్నట్లు మనూ భాకెర్ కోసం పనిచేస్తున్న యాడ్ ఏజెన్సీ ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సిఈఓ నీరవ్ తోమర్ తెలిపారు.


మనూ భాకెర్ ప్రస్తుతం ఒక సంవత్సరం కోసం మాత్రమే యాడ్ కాంట్రాక్స్ ఒప్పుకుంటున్నారని.. రెండు లేదా జీవిత కాలం బ్రాండ్స్ ప్రమోషన్ కోసం ఫీజు తక్కువగా ఉంటుందని తోమర్ వెల్లడించారు. ఇప్పటివరకు వచ్చిన కంపెనీలన్నీ రెండు లేదా మూడు నెలల వ్యవధి కోసమే యాడ్ చేయాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు.

Also Read: బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ రికార్డ్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి లక్ష్య సేన్

”ఏషియన్ గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్ లో మన భారతీయులు షూటర్లు గెలుచుకున్న మెడల్స్ అంత ప్రాముఖ్యం లభించదు.. అదే ఒలింపిక్స్ విషయం వేరు. ఒలింపిక్స్ లో ఒకటి లేదా రెండు మెడల్స్ సాధిస్తే.. విపరీతమైన పాపులారిటీ వస్తుంది,” అని తోమర్ అభిప్రాయపడ్డారు.

టోక్యో ఒలింపిక్స్ నిరాశ చెందిన మనూ భాకెర్ ఒలింపిక్స్ తో భారత్ కోసం పతకాలు సాధించిన తరువాత ఆమె గతంలో ఒలింపిక్స్ బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా లాగా నేషనల్ స్పోర్ట్స్ ఐకాన్ గా మారింది. ప్రస్తుతం మనూ భాకెర్ ఒలింపిక్స్ పోటీల్లో మూడో పతకం సాధన పై మాత్రమే దృష్టి పెట్టింది. శనివారం జరగబోయే చాటియోరాక్స్ షూటింగ్ రేంజ్ ఫైనల్ కు మనూ భాకెర్ అర్హత సాధించింది. ఫైనల్లో మొత్తం 8 మంది షూటర్స్ పాల్గొంటారు. ఫైనల్లో మనూ భాకెర్ బంగారు పతకం సాధిస్తే.. ఆమె అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా తరువాత ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన మూడో క్రీడాకారిణి చరిత్ర సృష్టిస్తుంది.

Also Read: మను భాకర్ కోచ్‌కు షాక్.. ఇంటిని కూల్చేస్తామని నోటీసు

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×