Manu Bhaker’s Team Send Legal Notice to Those Brands for Wrongful Celebration ads: ఒలింపిక్స్ లో రెండు పతకాలతో అదరగొట్టి సంచలనం సృష్టించిన మను బాకర్.. మరో సంచలనతో వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈసారి పతకంతో కాదు.. లీగల్ నోటీసులతో అందరి దృష్టి ఆకర్షించింది. చాలామంది అనుకోవడం ఏమిటంటే, అత్యుత్సాహంతో ఎవరైనా వార్తలు ఉన్నవి లేనివి రాసేశారా? తనని డ్యామేజ్ చేశారా? అనుకున్నారు. కానీ అవేమీ కాదు.
లీగల్ నోటీసులు ఇచ్చింది మీడియా సంస్థలకు కాదు.. కొందరు స్పాన్సర్లలకు అని తెలిసింది. నిజానికి క్రీడాకారులు తమ శిక్షణ కోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే క్రీడా పరికరాలు అమ్మే బ్రాండ్స్ సంస్థలు, ఇతర బిజినెస్ వర్గాలు, కార్పొరేట్ సంస్థలు వీరికి స్పాన్సర్ చేస్తుంటాయి. అందుకు అగ్రిమెంటు కూడా ఉంటుంది.
ఎందుకంటే వీరుగానీ ఫేమస్ అయితే తమ కంపెనీ ప్రొడక్ట్స్ కోసం ప్రకటనల్లో, ప్రారంభోత్సవాలకు వెళ్లాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా వీరిని పిలుస్తుంటారు. ఇదంతా బ్యాక్ గ్రౌండులో డబ్బులతో వ్యవహారాలు నడుస్తుంటాయి. అయితే ఒలింపిక్స్ లో తను రెండు పతకాలు సాధించేసరికి ఒక్కసారి తన బ్రాండ్ వాల్యూ పెరిగిపోయింది.
Also Read: మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ కొంప ముంచింది: శ్రీలంక కెప్టెన్
దీంతో మను బాకర్ ని స్పాన్సర్ చేయని కొన్ని కంపెనీలు తన ఫొటోని వాడేయడం మొదలుపెట్టాయి. ప్రకటనల్లో కూడా వాడేస్తున్నాయి. ఇవి గమనించిన మను బాకర్ టీమ్ ఆ స్పాన్సర్ కాని సంస్థలకు లీగల్ నోటీసులు పంపించాయి. భారత్ ఒలింపిక్ మెడల్ విజేతల ఫొటోలు, వీడియోలను సంబంధిత క్రీడాకారుల అనుమతి లేకుండా ఉపయోగించకూడదు. అందుకే మను బాకర్ టీమ్ వారికి లీగల్ నోటీసులను పంపించింది.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలను సాధించిన భారత క్రీడాకారిణిగా మను బాకర్ రికార్డ్ సృష్టించింది.