BigTV English

southport england violence: ఇంగ్లాండ్ లో ముగ్గురు స్కూల్ పిల్లల హత్య.. పోలీసులపై రాళ్లు రువ్విన ప్రజలు

southport england violence: ఇంగ్లాండ్ లో ముగ్గురు స్కూల్ పిల్లల హత్య.. పోలీసులపై రాళ్లు రువ్విన ప్రజలు

Southport England violence(Latest international news today): బ్రిటన్ లోని సౌత్ పోర్ట్ ఇంగ్లాండ్ ప్రాంతంలో మంగళవారం ముగ్గురు బాలికలను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడి ఇద్దరు పిల్లలు అక్కడే చనిపోగా మరో అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనలో పోలీసులు అనుమానంతో ఒక 17 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఆ ప్రాంత ప్రజలు ఆ యువకుడిని చంపేందుకు బుధవారం పోలీసులపై దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.. కానీ ప్రజలు రాళ్లు రువ్వడంతో 20 మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.


వివరాల్లోకి వెళితే.. సౌత్ పోర్ట్ ఇంగ్లాండ్ ప్రాంతంలో మంగళవారం ఒక స్కూల్ లో పిల్లల ఫ్యాషన్ కార్యక్రమంలో పాల్గొన్న 11 మంది చిన్నారులపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు (6,7 ఏళ్ల వయసు) అక్కడికక్కడే మరణించగా.. 9 ఏళ్ల మరో అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మరో 8 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లకు గాయాలయ్యాయి.

Also Read: ‘మీ బట్టలు సరిగా లేవు బయటికి వెళ్లండి’.. మహిళను గెంటేసిన రెస్టారెంట్ ఓనర్


దాడి చేసిన వారిలో కార్డిఫ్ అనే ఓ 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు అనుమానంతో అరెస్టు చేశారు. చిన్నపిల్లలను హత్య చేసిన కిరాతకులను తమకు అప్పగించాలని కోపంలో ఉన్న ఆ పిల్లల తల్లిదండ్రులు, కమ్యూనిటీ ప్రజలు పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు ఆ నిందితుడిని మరో ప్రదేశానికి తరలిస్తుండగా.. పోలీస్ వ్యాన్ కు నిప్పంటించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ప్రజలను అడ్డుకునేందుకు లాఠీ చార్జి చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులపై ప్రజలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి.

విషయం సీరియస్ కావడంతో ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఘటనా స్థలానికి చేరుకొని బాధిత తల్లిదండ్రులకు సంతాపం తెలిపారు. అయితే కోపంలో ఉన్న ప్రజలు ఆయనతో దుర్భాషలాడారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నా.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. అయితే ప్రధాని.. బాధితులకు న్యాయం చేస్తామని.. దోషులకు కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

Also Read: ఇజ్రాయెల్ మరో యుద్ధం ప్రారంభించబోతోందా?.. గాజా లాగా లెబనాన్ లో కూడా వినాశనం తప్పదా?..

Related News

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Russia Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తా! జెలెన్‌స్కీతో ట్రంప్ సంచలన భేటీ..

Congo Massacre: కాంగోలో దారుణం.. వెంటాడి మరీ 52 మందిని చంపేశారు

Nigeria Boat tragedy: మార్కెట్‌కి వెళ్తుండగా పడవ బోల్తా.. 40 మంది గల్లంతు

Big Stories

×