Siraj on ENG Players : టీమిండియా క్రికెటర్లలో మహ్మద్ సిరాజ్ ఒకరు. సిరాజ్ టీమిండియా టీ-20 వరల్డ్ కప్ సాధించిన జట్టులో కీలక సభ్యునిగా కొనసాగాడు. 2024లో టీమిండియా విజయం సాధించింది. దీంతో సిరాజ్ కి తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ పదవీ బాధ్యతలను అప్పగించింది. టీమిండియా కి క్రికెట్ ఆడుతూనే డీఎస్పీ గా తన విధులు నిర్వహిస్తున్నాడు సిరాజ్. తాజాగా టీమిండియా ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. అందులో తొలి ఇన్నింగ్స్ లో తొలుత భారత్ బ్యాటింగ్ చేసి 587 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం 335/5 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జెమీ స్మిత్, హార్రీ బ్రూక్ ఉన్నారు. వీరిద్దరూ సెంచరీలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే.. టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Mohammed Siraj: ప్రభాస్ హీరోయిన్ తో రొమాన్స్.. తెలంగాణ డీఎస్పీ సిరాజ్ ఎంతకు తెగించాడ్రా!
సిరాజ్ ని ఆపడం కష్టం..
వాస్తవానికి క్రికెట్‌లో మొహమ్మద్ సిరాజ్‌కు ఒకటి రెండు వికెట్లు వస్తే.. ఇక అతన్ని ఆపడం కష్టం. బీభత్సమైన కాన్ఫిడెన్స్‌తో సూపర్‌గా బౌలింగ్ చేస్తాడు. సిరాజ్ చెలరేగాడంటే.. ప్రత్యర్థి జట్టు ఆశలు వదిలేసుకోవాల్సిందే. తనదైన రోజున వికెట్లు తీస్తూనే ఉంటాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సిరాజ్ తన ట్రాక్ పట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలేను అవుట్ చేసిన సిరాజ్.. ఈ రోజు వరుస బంతుల్లో జో రూట్, బెన్ స్టోక్స్‌లను అవుట్ చేసి, పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు వికెట్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో సిరాజ్ తీసిన ఈ మూడు వికెట్ల పై సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేశారు. డీఎస్పీ సిరాజ్ ముగ్గురినీ అరెస్టు చేశాడంటూ.. మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 22వ ఓవర్ మూడో బంతికి జో రూట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. అప్పటికే రూట్ లాంటి కీలక వికెట్ తీసి.. ఫుల్ జోష్‌లో ఉన్న సిరాజ్ స్టోక్స్‌కు సెట్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు. రాగానే ఫస్ట్ బాల్‌ను అద్భుతంగా బాడీపైకి బౌన్సర్ సంధించాడు. దాంతో తొలి బంతికే బెన్ స్టోక్స్ షాక్ తిన్నాడు.
షాక్ కి గురైన బెన్ స్టోక్స్..
సిరాజ్ సంధించిన ఆ బౌన్సర్‌ను ఎలా ఆడాలో తెలియక.. అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, బాల్ ఎడ్జ్ తీసుకొని.. వెళ్లి పంత్ చేతుల్లో పడింది. పంత్ ఒక సింపుల్ క్యాచ్ తీసుకున్నాడు. అంతే అసలేం జరిగిందో కూడా స్టోక్స్‌కు అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక పెవిలియన్ వైపు నడిచాడు. 84 పరుగుల వద్దే ఇంగ్లాండ్ 4, 5వ వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిందని అందరూ అనుకున్నారు. కానీ బ్రూక్, స్మిత్ చెలరేగారు. జెమీ స్మిత్ 154, బ్రూక్ 125 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ డబుల్ సెంచరీతో ఏకంగా 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. గిల్ 269 పరుగులతో చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ 87, జడేజా 89, వాషింగ్టన్ సుందర్ 42 పరుగుల ఇన్నింగ్స్‌లు కూడా టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో ఉపయోగపడ్డాయి.