Mohammed Siraj: సినీ తారలతో క్రికెటర్లు ప్రేమాయణం నడపడం సర్వసాధారణ విషయం. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ వంటి జంటలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇందులో కొన్ని ప్రేమకథలు పెళ్లి వరకు చేరుకుంటే.. మరికొన్ని జంటలు డేటింగ్ వరకే పరిమితమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..? ఇప్పుడు నెట్టింట ఓ కొత్తజంట మీద పుట్టుకొచ్చిన రూమర్ ట్రెండింగ్ గా మారింది.
Also Read: Chicken RS 1000 Per Kg: ధోని బిజినెస్ అదుర్స్.. కేజీ చికెన్ 1000 రూపాయలు.. దీని ప్రత్యేకత ఇదే
టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ డేటింగ్ లో ఉన్నాడంటూ కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య లెజెండరీ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో మహమ్మద్ సిరాజ్ ప్రేమలో ఉన్నాడని రూమర్లు వచ్చాయి. అయితే వాటిని సిరాజ్ ఖండించారు. ఆమె తనకు సోదరి లాంటిదని స్పష్టం చేశారు.
శ్రద్ధా కపూర్ తో సిరాజ్ డేటింగ్..?
ఇక తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ తో మొహమ్మద్ సిరాజ్ డేటింగ్ లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. అయితే వీరిద్దరూ కలిసి ఇంతవరకు ఎక్కడా కనిపించకపోయినా.. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. డీఎస్పీ సిరాజ్ అనే పేరుతో ఇంస్టాగ్రామ్ లో ఓ ఖాతా ద్వారా వీరి ఫోటోలతో కూడిన ఓ వీడియోని క్రియేట్ చేసి.. ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమేనని ఉన్న వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.
ఇది చూసిన మహమ్మద్ సిరాజ్ అభిమానులు.. ఇకనైనా ఇటువంటి పనులు మానుకోవాలని సూచిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన తీవ్ర విమర్శలకు దారితీసింది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం మూడు పరుగులకు నాటౌట్ గా నిలిచిన సిరాజ్.. బౌలింగ్ లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో తొలి బంతికే గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
Also Read: Dhoni Brothers: సోదరుడితో గొడవలు… ఒక్క వీడియోతో అందరి నోర్లు మూయించిన మహేందర్ సింగ్ ధోని
అయితే ప్రస్తుతం ఒత్తిడిని అధిగమించి రెండవ టెస్ట్ లోని తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక శ్రద్ధా కపూర్ వైవిద్యమైన కథా చిత్రాలతో బాలీవుడ్ లో ప్రతిభవంతురాలు అయిన కథానాయకగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన “సాహో” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైంది. ఏబిసిడి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తరువాత ఓకే జాను, భాఘీ, ఆషికి వంటి చిత్రాల్లో నటించి తన నటనతో అందరిని మెప్పించింది. తాజా సమాచారం ప్రకారం.. ఈమె ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోతున్న చిత్రంలో.. ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం.
?utm_source=ig_web_copy_link